Anchor Shyamala: వైసీపీ చీఫ్ జగన్ యాంకర్ శ్యామలకు (Anchor Shyamala ) కీలక పదవిని కట్టబెట్టారు. ఆమెతో పాటుగా ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీనిపై శ్యామల రియాక్షన్ ఏంటని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే ….యాంకర్ శ్యామల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆకట్టుకునే అందం, నటన, యాంకరింగ్ తో సుదీర్ఘ కాలంగా బుల్లితెర వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. కేవలం యాంకరింగ్ తోనే కాకుండా సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ నటించిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన నటన, అభినయం, అందంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
ఇప్పటికీ కూడా శ్యామల చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన సత్తాను చాటుతున్న శ్యామల సోషల్ మీడియాలోనూ రచ్చరంబోలా చేస్తోంది. సుదీర్ఘకాలం నుంచి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న యాంకర్ శ్యామల (Anchor Shyamala ) తరచూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు అదిరిపోయే హాట్ ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తుంటుంది. వీటిలో అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయి మరి ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది.
అయితే ఈ మధ్యకాలంలో శ్యామల తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ గా మారుతుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల (Anchor Shyamala ) తెగ హాట్ టాపిక్ గా మారింది. వైయస్ జగన్ కు మద్దతుగా, వైసీపీ తరఫున ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు శ్యామల. ఇవి కాస్తా టీడీపీ, జనసేన నేతల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీంతో శ్యామలను చంపేస్తామని చాలామంది బెదిరింపులకు చేశారు. అయినప్పటికీ శ్యామల ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ వెంటే ఉంది. జగన్ కోసం ఆమె పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. వైసీపీలో శ్యామలకు జగన్ (Jagan) కీలక పదవిని అప్పగించాడు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నష్ట నివారణ చర్యలకు దిగిన వైయస్ జగన్ వైసీపీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) రాష్ట్ర అధికార ప్రతినిధిగా నలుగురికి అవకాశం కల్పించాడు. ఇందులో యాంకర్ శ్యామల ముందు వరుసలో ఉంది. ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్యామలతో పాటుగా మాజీ మంత్రి ఆర్కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాష్ట్ర అధికారిక ప్రతినిధులుగా నియమిస్తూ ఉద్యోగం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు స్పందించిన శ్యామల ఆ పదవికి తాను సిద్ధమేనంటూ చెప్పిందని సమాచారం. ఇక వైసీపీలో కీలక పదవి ఇచ్చినందుకు యాంకర్ శ్యామల స్పందించారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని ప్రకటించారు. వైసీపీ కోసం ప్రాణాలు ఇస్తానని వెల్లడించారు.