Kanguva : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న “కంగువ” చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ట్రైలర్ తో మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు. ఈ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ పై కన్నేశాడు సూర్య. ఇంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ ఆశించినంత విజయం మాత్రం దక్కలేదు. ఇక కంగువ సినిమాని తమిళ దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, కంగువ సినిమాని స్టూడియోగ్రీన్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇక పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఒక తెగకు చెందిన వారియర్‌గా, బాబీ డియోల్ మరో తెగకు చెందిన విలన్ గా కనిపిస్తుండగా, ట్రైలర్ తో అంచనాలు స్కై లెవెల్ కి వెళ్లిపోయాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ కి సంబంధించి అన్ని హీనులు పూర్తవగా, రిలీజ్ డేట్ నాటికి తమ ప్రమోషన్లతో భారీ హైపెక్కించాలని చూస్తున్నాడు.
బడా నిర్మాణ సంస్థ చేతికి కంగువ రైట్స్..
ఇదిలా ఉండగా కంగువ (Kanguva) వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్ లో బిజినెస్ చేస్తుండగా, దాదాపు 200 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. ఇక తాజాగా కంగువ ఓవర్సీస్ రైట్స్ ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ వారు దక్కించుకున్నట్టు సమాచారం. ఇక కంగువ కి సంబంధించి అన్ని ఏరియాల్లో బిజినెస్ అయిపోగా, ఇంకా అఫిషియల్ గా లెక్కలు రివీల్ చేయలేదు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మెల్లిగా ఒక్కో పాట రిలీజ్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేయనున్నారు.
పది భాషల్లో రిలీజ్…
ఇక కంగువ లో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడే సీన్స్ థియేటర్లో గూస్పంప్స్ తెప్పిస్తాయని టాక్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న, ఈ సినిమా ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 3డీ ఫార్మాట్లోనూ రానుంది.. ఇక కంగువ సినిమాను అక్టోబర్ 10న థియేటర్స్ లలో రిలీజ్ చేస్తుండగా, సూర్య కి పోటీగా రజినీకాంత్ వెట్టయిన్ కూడా విడుదలైయ్యే అవకాశం ఉంది.