GabbarSingh ReRelease : టాలీవుడ్ లో కొన్నాళ్లుగా రీ రిలీజ్ ప్రభావం తగ్గిపోయేసరికి, రీ రిలీజ్ లపై జనాలకు ఆసక్తి తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా మురారి (Murari) సినిమాతో మళ్ళీ రీ రిలీజ్ ల హంగామా ఓ రేంజ్ లో మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఇక దాని తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఇంద్ర” (Indra) సినిమా రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ చేయాలనీ చిరు ఫ్యాన్స్ ఎప్పట్నించొ కోరుకుంటుండగా, ఎట్టకేలకు చిరు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 22న థియేటర్లలో రీ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్లలో భారీ వసూళ్లు సాధించింది. మరీ ఖుషి, మురారి సినిమాల రేంజ్ లో కాకపోయినా, సీనియర్ స్టార్ హీరోల పరంగా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ లో ఇంద్ర ఆల్ టైం రికార్డ్..
ఇక ఇంద్ర సినిమా రీ రిలీజ్ లో 3.40 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా, ఓవర్సీస్ లో ఫస్ట్ డే ఏకంగా 76k డాలర్ల ఓపెనింగ్స్ సాధించి రీ రిలీజ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. సింహాద్రి పేరిట ఓవర్సీస్ లో ఉన్న ఈ రికార్డ్ ని చిరు (Chiranjeevi) బ్రేక్ చేసాడు. ఇక ఓవర్సీస్ లోనే కాకుండా ఇంద్ర బెంగుళూర్, చెన్నై లో కూడా రీ రిలీజ్ లో అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అన్నయ్య రికార్డులు బ్రేక్ చేయడానికి తమ్ముడు రెడీ అవుతున్నాడు.
అన్నయ్య రికార్డ్ ని తమ్ముడు బ్రేక్ చేస్తాడా?
ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) బర్త్ డే స్పెషల్ గా బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ (GabbarSingh ReRelease) అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నయ్య చిరంజీవి ఇంద్ర సినిమాతో ఓవర్సీస్ లో నెలకొల్పిన రికార్డ్ ని తమ్ముడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. గబ్బర్ సింగ్ సినిమా ఏకంగా 100k డాలర్స్ ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నారట మెగాభిమానులు. ఇక గబ్బర్ సింగ్ సినిమా ఫ్యాన్స్ కి ఎంత ఫెవరేటో తెలిసిందే. ఇప్పటికే ఖుషి, జల్సా లాంటి సినిమాలతో ఓ రేంజ్ రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్ తో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ కి ట్రై చేస్తున్నారు. మరి గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2న రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.