Saripodhaa Sanivaaram : ఏడాదిగా ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.. నాని తన రికార్డ్ ని తానే బద్దలుకొడతాడా?

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోల తర్వాత మీడియం రేంజ్ హీరోల మార్కెట్ కూడా పెద్దదవుతుంది. మీడియం రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కూడా ఓపెనింగ్స్ లో రికార్డ్ వసూళ్లు సాధిస్తున్నాయి. స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా, మార్కెట్ పరంగా, అప్పుడప్పుడూ కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి లాంగ్ రన్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తే, మరికొందరి స్టార్స్ సినిమాలు ఓపెనింగ్స్ తోనే రికార్డు వసూళ్లు సాధిస్తాయి. అయితే టైర్ 2 హీరోల పరంగా టాప్ లో దూసుకుపోతుంది నాని ఒక్కడే. మిగతా హీరోలు ప్లాప్ లు అందుకుంటూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ ఇయర్ పలువురు మీడియం రేంజ్ స్టార్ హీరోలు డిజాస్టర్లు అందుకోగా, త్వరలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

Will Nani's Saripodhaa Sanivaaram Create Day One Records?

ఎవ్వరూ టచ్ చేయని రికార్డ్..

ఇక అసలు విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ నాని (Nani) నటించిన ఊరమాస్ మూవీ “దసరా” (Dasara) టాలీవుడ్ లో టైర్2 హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.22 కోట్ల షేర్ ని 24.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించగా, ఆ తర్వాత పలువురు మీడియం రేంజ్ స్టార్స్ చాలా సినిమాలతో వచ్చారు. కానీ ఈ రికార్డ్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. విజయ్ దేవరకొండ, రామ్, నితిన్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, సిద్ధూ జొన్నలగడ్డ ఇలా ఎవ్వరూ దసరా ఫస్ట్ డే రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ నానియే తన రికార్డ్ బ్రేక్ చేసే బద్దలుకొట్టేలా ఉన్నాడు.

- Advertisement -

తన రికార్డ్ తానే బ్రేక్ చేస్తాడా?

ఇక నాని నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న రిలీజ్ అవుతుండగా, ఈ సినిమా ప్రమోషన్ లలో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను మరో లెవెల్ కి తీసుకుకెళ్లాయని చెప్పొచ్చు. ఇప్పుడు నాని దసరా సినిమా ఓపెనింగ్ డే రికార్డ్ ని సరిపోదా శనివారం సినిమాతో బ్రేక్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాపై స్కై లెవెల్ లో హైప్ ఉన్న నేపథ్యంలో పైగా, పంద్రాగస్టున రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో థియేటర్లు ఖాళీ అయ్యాయి. దీంతో సరిపోదా శనివారంకి భారీగా థియేటర్లు రాబోతుండగా, దసరా రికార్డ్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు