GameChanger : ‘దేవర’ సెట్ చేసిన ఈ సాలిడ్ రికార్డును ‘గేమ్ ఛేంజర్’ కొట్టగలదా?

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం (Shankar Shanmugam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తయిపోయినా, చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. అప్పుడెప్పుడో ఒక ఫస్ట్ లుక్ పోస్టర్, ఓ లిరికల్ సాంగ్ మినహా మరే అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై పలుమార్లు సోషల్ మీడియాలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు చాలా రోజులకు వినాయకచవితి స్పెషల్ గా ఒక సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలి రెండో సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా పలు రికార్డులు తిరగరాస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Will GameChanger break Devara's overseas record?

దేవర రికార్డ్ ని గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా?

ఇదిలా ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ (GameChanger) సినిమా వరల్డ్ వైడ్ గా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమా దేవర (Devara)కు ఇప్పటినుండే భారీ బుకింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్ లో మూడు వారాల ముందే 1 మిలియన్ డాలర్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టడం విశేషం. మూడు వారాల ముందుగానే 1 మిలియన్ కొట్టేసిన సినిమా దేవర మాత్రమే కావడం విశేషం. అయితే దేవర తర్వాత రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా గేమ్ ఛేంజర్. అందువల్ల దేవర క్రియేట్ చేసిన ఈ సాలిడ్ రికార్డ్ ను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ప్రమోషన్లలో స్పీడ్ పెంచాలి…

అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి కనీసం టీజర్ కూడా రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తితో ఉండగా, గేమ్ ఛేంజర్ గనుక డిసెంబర్ లో రిలీజ్ చేస్తే, ఇప్పట్నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టాలని, దసరాలోగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని ముందుగా అనౌన్స్ చేయమని దిల్ రాజు పై ఫైర్ అవుతున్నారు. ఇక మొన్నామధ్య రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ అప్డేట్ లో కనీసం రెండో సాంగ్ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేయకపోవడంతో ఫాన్స్ చిర్రెత్తిపోయి ఉన్నారు. ఇకనైనా గేమ్ ఛేంజర్ మేకర్స్ మేల్కొని రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారేమో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు