NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ (NTR). ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఏదో ఒక సినిమాను అందించాలనే లక్ష్యంతో మంచి కాన్సెప్ట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఉంటాడు. సినిమాలో ఎన్టీఆర్ ప్రాణం పెట్టి నటిస్తాడు అనే టాక్ ఎప్పటినుంచో ఉంది. అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో (Devara) బిజీగా ఉన్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక ఎన్నో అంచనాల నడుమ దేవర సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా…. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు అనిరూధ్ స్వరాలు అందించారు.
తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ నే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ…. క్లైమాక్స్ సీన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా యాక్షన్ ప్యాకెడ్ సీక్వెన్స్ లపై భారీగా అంచనాలు ఉన్నాయని దేవరాజు సినిమాలోను చివరి 40 నిమిషాలు మామూలుగా ఉండదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. ఆ డ్రెస్ ధర ఎంత ఉంటుందనే విషయంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు రూ . 50,000, స్వెటర్ ధర 46,400, ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ఖరీదు 90,000, వాచ్ ధర ఒక కోటి వరకు ఉంటుందని సమాచారం. ఫైనల్ గా ఎన్టీఆర్ లుక్ చాలా క్లాసిక్ గా ఉందని అభిమానులు అంటున్నారు.
కాగా ప్రొడక్షన్ టీం ఈ సినిమాను సెన్సార్ కు పంపించగా…. సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం మీద పది షాట్స్ కట్ చేయమని చెప్పారట. దర్శకుడు, ఎడిటర్ వీటిని తొలగించిన తర్వాత దేవర సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని చెప్పారు. ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, రెండు పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన అభినయంతో ఆకట్టుకున్నాడని చెప్పడంతో సినీ ప్రియులు, ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి హృతిక్ రోషన్ గెస్ట్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం హృతిక్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం నటిస్తున్నారు. ఆ స్నేహం కారణంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హృతిక్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈవెంట్ కు రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఏదో ఒక అధికారిక ప్రకటన చేస్తే కానీ అసలు విషయం తెలియదు.