Game Changer : తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా పేరు అందుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) .. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క త్రిపుల్ ఆర్ తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. త్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను రోబో ఫేమ్ శంకర్ ( Sankar ) తెరకేక్కిస్తున్నారు. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, డిఫరెంట్ కథతో రాబోతున్న సినిమా కావడంతో శంకర్ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఇంటర్వేల్ సీన్ కోసం కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో వచ్చిన సినిమాలకు, ఈ సినిమాకు భారీ వ్యత్యాసం ఉందని తెలుస్తుంది. సరికొత్త లుక్ లో చెర్రీ కనిపిస్తున్నాడు. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ సీనే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టాక్..
మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు తెలుసుకోవాలని ఆసక్తి అభిమానంలో నెలకొంది. మెగా అభిమానులు కూడా ఈ సినిమా తో చరణ్ భారీ సక్సెస్ అందుకుంటే తనను మించిన సెలబ్రిటీస్ మరొకరు ఉండరు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మొన్నీమధ్య రిలీజ్ అయిన సాంగ్ యూట్యూబ్ రికార్డ్ లను బ్రేక్ చెయ్యడం విశేషం.. మొత్తానికి చెర్రీ ఖాతాలో మరో హిట్ పడేలా ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చెర్రీ ఇప్పటికే ఆర్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్.. మెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్‌గా, తన తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో స్టార్ హీరోగా మరోసారి తనను తను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..