Vivek Athreya : కొన్ని సినిమాలు ఎంతో నమ్మకంతో తెరకెక్కిస్తుంటారు కొంతమంది దర్శకులు. అంత నమ్మకంతో చేసిన సినిమాలు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అని ఊహిస్తారు. కానీ ఆ సినిమాలో ఊహించని ఫలితాన్ని మూట కట్టుకుంటాయి. మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వివేక్ ఆత్రేయ నాని హీరోగా తెరకెక్కించిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
అంటే సుందరానికి సినిమా విషయానికి వస్తే కొంతమందికి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ కనిపిస్తూ ఉంటాయి. ఇంత మంచి సినిమాను ఎలా ఫెయిల్ చేశారని డిస్కషన్స్ జరుగుతుంటాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫీల్డ్ హియర్ అని పోస్టులు కూడా కనిపిస్తాయి. ఇక ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం వలన. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక యాక్షన్ ఫిలిం ప్లాన్ చేశాడు వివేక్ ఆత్రేయ. నాని హీరోగా చేసిన సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై అద్భుతమైన సక్సెస్ ను సాధించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల వసూలు చేసింది.
ఇకపోతే ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూస్ పాల్గొంటున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. సరిపోదా శనివారం కంటే కూడా అంటే సుందరానికి చాలా పెద్ద స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్. సరిపోదా శనివారం విషయానికొస్తే ఇది ప్లాన్ స్క్రిప్ట్. ఆడియన్స్ డిసైడ్ కంటే కూడా ఆ స్క్రిప్ట్స్ రాసింది నేనే కాబట్టి నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే సుందరానికి సినిమా. ఇకపోతే వివేక్ తో పాటు అంటే సుందరానికి సినిమా బెస్ట్ రైటింగ్ అని ఒప్పుకునే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.
అంటే సుందరానికి విషయానికి వస్తే ఒక మామూలు కథని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. వీటన్నిటిని మించి వివేక్ సాగర్ ఈ సినిమాకి అందించిన సంగీతం అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమాలో కామెడీ ఎమోషన్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు వివేక్. ఏదేమైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్టి ఫ్యాన్ బేస్ ఉంటుంది.