Vishwambhara : విశ్వంభర స్టోరీ లైన్ లీక్ చేసిన తెలుగమ్మాయి..

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతికి ఎలాగైనా తీసుకురావాలనే లక్ష్యంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా 70 శాతానికి పైగా పూర్తవగా, కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా విశ్వంభర సినిమా గురించి తాజాగా ఓ లీక్ వచ్చింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో విశ్వంభర (Vishwambhara) గురించి కొన్ని విషయాలు లీక్ చేసింది.

Vishwambhara movie story line leaked by Ramya pasupuleti

విశ్వంభర నేపథ్యం ఇదే – రమ్య పసుపులేటి

తెలుగు అమ్మాయి అయిన రమ్య పసుపులేటి (Ramya pasupuleti) పలు చిన్న సినిమాల్లో నటించి పాపులర్ కాగా, ఆమె రీసెంట్ గా ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthinagar Subrahmnyam) మూవీ లో నటించగా ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఆ సినిమా గురించి ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో రమ్య విశ్వంభర గురించి ఆసక్తికర విషయాలు లీక్ చేసింది. ఇంటర్వ్యూ లో రమ్య మాట్లాడుతూ… విశ్వంభర సినిమాలో తాను మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. ముందుగా వద్దనిపించినా, కానీ చిరంజీవి (Chiranjeevi) సినిమా కాబట్టి ఆఫర్ అస్సలు వదులుకోరాదని చేసానని అంది. అయితే కథలో తన పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉందని, తనతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా చిరు చెల్లెళ్లుగా నటించారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఫాంటసీ ఎలిమెంట్స్ తో సిస్టర్ సెంటిమెంట్..

ఇక విశ్వంభర లో తనతో పాటు మరో నలుగురు చిరంజీవికి చెల్లెళ్లుగా నటిస్తున్నామని రమ్య పసుపులేటి చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఫాంటసీ సినిమా అని అందరూ అంటున్నా, సిస్టర్ సెంటిమెంట్ ఈక్వెల్ గా ఉంటుందని రమ్య చెప్పింది. ఇక ఈ సోషియో ఫాంటసీ సినిమాకి సిస్టర్ సెంటిమెంట్ తోడైతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్య తో పాటు ఆశికా రంగనాథ్ రంగనాథ్, ఇషా చావ్లా, సురభి వంటి హీరోయిన్లు చిరు చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇక విశ్వంభర సినిమాని పక్కాగా సంక్రాంతికే రిలీజ్ చేయాలనీ, చిరు స్ట్రాంగ్ గా ఫిక్సయ్యాడని తెలుస్తుంది. చిరంజీవి బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు