MechanicRocky : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది ఆల్రెడీ గామి తో హిట్ కొట్టిన విశ్వక్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా లైలా పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దానికంటే ముందు ఆల్రెడీ “మెకానిక్ రాకీ” (Mechanic Rocky) అనే మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ ఓ కార్ మెకానిక్ గా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపుగా అయిపోగా, తాజాగా టీం నుండి మరో అప్డేట్ వచ్చింది.
తన డబ్బింగ్ పని కూడా పూర్తి చేసేసిన విశ్వక్..
ఇక విశ్వక్ సేన్ (Vishwak sen) నుండి మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ను రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా మేకర్స్ నుండి తాజాగా అప్డేట్ వచ్చింది. మెకానిక్ రాకీ సినిమాకి సంబంధించి విశ్వక్ సేన్ తన డబ్బింగ్ పనులను మొదలెట్టాడు. ఈ విషయాన్నీ మేకర్స్ డబ్బింగ్ స్టూడియో లో ఉన్న పిక్స్ తో తెలియచేసారు. ఇక ఈ డబ్బింగ్ పనులు పూర్తవగానే నెక్స్ట్ అప్డేట్ గా సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ కథను రవితేజ ముళ్ళపూడి రచించగా, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
ఇక ప్రమోషన్లపైనే ఫోకస్..
ఇక మెకానిక్ రాకీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలవగా, చిత్ర యూనిట్ ప్రమోషన్లపైనే ఫోకస్ పెట్టనుంది. వచ్చే వారం రెండో సాంగ్ ని రిలీజ్ చేయడనికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ లో టీజర్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెకానిక్ రాకీ సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానుంది.