Vishnu Priya : ఒకప్పుడు సెలబ్రిటీలు ఏ మాట మాట్లాడినా కూడా పెద్దగా రిస్క్ ఉండేది కాదు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఏ మాట మాట్లాడినా కూడా అదంతా ఈజీగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మళ్లీ ఆ మాటలను డామినేట్ చేసినప్పుడు, మర్చిపోయినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది గుర్తు చేస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగు లో బిగ్ బాస్(Bigg Boss) షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ షో గురించి అనేక మాటలు మాట్లాడారు. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ షో కి ఆయనే హోస్ట్ గా మారారు.
ఇక రీసెంట్ గా బిగ్బాస్ 8 మొదలైన విషయం తెలిసిందే దీనిలో అనేకమంది సెలబ్రిటీస్ పాల్గొంటున్నారు. దీనిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఉన్నారు. విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రానా చేసిన నెంబర్ వన్ యారి షోలో మొదట కనిపించింది విష్ణు ప్రియ. ఆ తర్వాత సుధీర్ విష్ణు ప్రియ కలిసి పోవే పోరా అని ఒక షో చేశారు. ఆ తర్వాత కొన్ని కవర్ సాంగ్స్ చేయడం. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించడం వంటివి చేయడంతో మంచి గుర్తింపును సాధించుకుంది.
ఇప్పుడు విష్ణు ప్రియ(Vishnu Priya) కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. అయితే ఈ తరుణంలో గతంలో విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్బాస్ కి నేను కొన్ని కోట్లు ఇచ్చినా కూడా వెళ్ళను. ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. అందమైన ప్రపంచం బయట ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంట్లో ఉండాలని అనుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో వాళ్లని చూసుకోవాలి. ఐ యాం నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు. నన్ను పర్సనల్గా అడిగితే నేను ఎంకరేజ్ కూడా చేయను అంటూ చెప్పుకొచ్చింది. కానీ అదే విష్ణు ప్రియ ఇప్పుడు షోలో కంటెస్టెంట్ గా కనిపిస్తుంది. దీంతో ఆల్రెడీ ఆమెపై ట్రోల్స్ మొదలైపోయాయి.