Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy ) రీసెంట్ గా ది గోట్ ( The Goat ) మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం దున్నెస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ మోత మోగిపోతుంది. ఇక విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూ పోతున్నాడు. గోట్ మూవీ కోసం ఆయన రూ. 250 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇప్పుడు అంతకు మించి వసూల్ చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. విజయ్ నెక్స్ట్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ది గోట్ మూవీ తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రాజకీయా ల్లో బిజీ అవ్వాలని అనుకున్నట్లు గతంలో చాలా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. కాగా ఈ చిత్రం కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ 69 వ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఇదే విజయ్‌కి చివరి సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కన్నడ కెవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇదే తన చివరి అని కూడా అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ చిత్రం విజయ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలోనే తన చివరి సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం..
విజయ్ దళపతి 69 వ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు అందరికీ షాక్ ఇచ్చే రేంజులో రెమ్యూనరేషన్ ను తీసుకోబోతున్నాడు. రూ. 275 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనున్నారని టాక్. ఇప్పటివరకు ఇండియాలో మరే నటుడూ ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు. ఇటీవలే భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితా లో దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దళపతి రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెరిగాయి. మరి సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో చూడాలి. ఏది ఏమైనా విజయ్ అంత తీసుకోవడం పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ ను చూస్తుంటే ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమా లో ఎవరు నటిస్తున్నారో అన్నది త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.