Tamannah – VijayVarma : టాలీవుడ్ మిల్కిబ్యూటీ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ లోనే ఎక్కువ బిజీ అవుతుంది. సౌత్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నా, అంతగా సక్సెస్ రావడం లేదు. దాంతో బాలీవుడ్ కే ఎక్కువ మొగ్గుచూపుతోంది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లేకపోయినా ఆఫర్లకేమి కొదవలేదు. ఇదిలా ఉండగా తమన్నా- విజయ్ వర్మ (Tamannah – VijayVarma) ల లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమన్నా – విజయ్ వర్మల మధ్య ప్రేమ చిగురించింది. అక్కడితో కొన్నాళ్ల వరకు వీరి ప్రేమ రహస్యంగానే ఉంచినా, ఫైనల్ గా బయట పెట్టేసారు. ఇక ప్రస్తుతం ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ, అప్పుడప్పుడూ నెట్టింట సందడి చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమన్నా తో తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
తన ఫొటోలు ఐదువేలు దాచుకున్నా – విజయ్ వర్మ
తాజాగా విజయ్ వర్మ తమన్నాతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విజయ్ వర్మ (VijayVarma) మాట్లాడుతూ.. తమన్నాతో తన రిలేషన్ దాచాలని ఎప్పుడూ అనుకోలేదని, సీక్రెట్ గా ఉంచాలనుకున్నా కూడా, ఫ్రీడమ్ కోరుకునే తన లాంటి వాళ్లకు సాధ్యం కాదని, అందుకే ఓపెన్ గానే అందరికీ తమ రేలషన్ షిప్ ని అందరికి తెలియజేశామని చెప్పుకొచ్చాడు. అయితే బయట ప్రపంచానికి చెప్పని, షేర్ చేయని ఎన్నో విషయాలు తమ మధ్య ఉన్నాయని విజయ్ వర్మ అన్నాడు. ఇక సోషల్ మీడియాలో ఇప్పటివరకు పంచుకోని విషయం ఏంటంటే.. తన తగ్గర తమన్నా కి సంబంధించి ఐదు వేల ఫోటోలు దాచుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమన్నా (Tamannah) అంటే ఇంత పిచ్చా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
వరుస సినిమాలతో ఇద్దరూ బిజీ..
ఇక విజయ్ వర్మ తెలుగులో నాని MCA సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో ఫుల్ బిజీ అయ్యాడు. రీసెంట్ గా మీర్జాపూర్3 సిరీస్ లో నటించాడు. ఇక తమన్నా ఈ ఇయర్ తమిళ్ లో అరన్మలై4 తో హిట్ అందుకోగా, హిందీలో స్త్రీ2 లో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఓదెల2 (Odela2) సినిమాతో బిజీగా ఉంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.