VidudalaPart2 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaran) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా “విడుదలై”. కోలీవుడ్ కమెడియన్ కం హీరో సూరి (Soori) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘విడుదలై పార్ట్1’ లాస్ట్ ఇయర్ థియేటర్లలో విడుదలయి మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. విడుదలై లో ప్రజాదళం నక్సలైట్ నాయకుడిగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా, పై ఆఫీసర్ల నుంచి వివక్ష ఎదుర్కొనే ఓ కానిస్టేబుల్‌గా సూరి నటించాడు. పోలీసులకు, ప్రజా దళానికి మధ్య పోరాటమే ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా తెలుగులో “విడుదల” పేరుతో రిలీజ్ కావడం జరిగింది.
పార్ట్2 రిలీజ్ డేట్ ప్రకటన…
అయితే ఈ సినిమా పార్ట్2 పై మూవీ లవర్స్ లో ఎంతో ఆసక్తి నెలకొని ఉండగా, తాజాగా విడుదల పార్ట్2 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు మేకర్స్. విడుదల పార్ట్2 సినిమా డిసెంబర్ 20న క్రిస్మస్ స్పెషల్ గా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇక ఈ రెండో పార్ట్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో ఉన్న నటీనటులే ఉండనుండగా, రెండో పార్ట్ లో విజయ్ సేతుపతి రోల్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇక ఈ సినిమా నిడివి కూడా మూడు గంటల పాటు ఉండే ఛాన్స్ ఉందట. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మెంటర్ గా ఉండనుండగా, తన తరపున సూరి పోరాడతాడని సమాచారం.
గ్లోబల్ స్టార్ కే పోటీగా?
అయితే విడుదల పార్ట్2 రిలీజ్ డేట్ ని డిసెంబర్ 20కి అనుకోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న “గేమ్ ఛేంజర్” (GameChanger) సినిమా రిలీజ్ కాబోతుందని దిల్ రాజు ఇది వరకే ప్రకటించాడు. కానీ ఆ డేట్ కే విడుదల2ని రిలీజ్ చేస్తున్నారంటే అది పెద్ద రిస్కే అని చెప్పాలి. పైగా తమిళనాట శంకర్ సినిమా అంటే, ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఫైనల్ గా ఈ రిలీజ్ డేట్ ని అప్పటివరకు కంటిన్యూ చేస్తారా? లేక ఏదైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి.