వెట్టయ్యన్: తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (రజినీకాంత్) జైలర్ (జైలర్) తర్వాత నటిస్తున్న సినిమా వెట్టయాన్ (వెట్టయన్) .. జైలర్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ మూవీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా, మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. మల్టీస్టారర్ యాక్షన్ డ్రామా మూవీకి జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఏ అప్డేట్స్ భారీ హైప్ ను క్రియేట్ చేసారు.. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. కొన్ని నిమిషాల ముందు మొదటి పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్తో తో వచ్చే లిరిక్స్ వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. అంతలా మ్యూజిక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ పాట రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో వ్యూస్ ను రాబడుతుంది. ప్రస్తుతం ఈ మాస్ బీట్ సాంగ్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తలైవా రజినీకాంత్ మరోసారి తన మార్క్ స్టైలిష్ సింపుల్ స్టెప్లతో మెప్పించారు. మంజూ వారియర్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు. ఇక రజినీతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ డ్యాన్స్ అదరగోట్టాడు.. మనసిలాయో పాటకు ఫాస్ట్ మాస్ బీట్ ఇచ్చారు అనిరుధ్. జైలర్ తర్వాత మరోసారి తలైవాకు అదిరిపోయే సాంగ్ అందించారు. ఈ పాట కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ మనసిలాయో పాట కోసం ప్రముఖ దిగ్గజ సింగర్ మలేసియా వాసుదేవన్ (వాసుదేవ్) గాత్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ సాయంతో తీసుకొచ్చారు అనిరుధ్ రవిచందర్. అతని గొంతును రీక్రియేట్ చేశారు. మలేసియా వాసుదేవన్ గాత్రంతో పాటు యుగేంద్రన్ వాసుదేవన్, అనిరుధ్ రవిచందర్, దీప్తి సురేశ్ కూడా ఈ పాటను ఆలపించారు. సూపర్ సుబ్బు ( super subbu), విష్ణు ఇడవన్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ప్రస్తుతం తమిళంలో ఈ పాట వచ్చింది.. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషర విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్. వెట్టైయన్ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల అవుతుందని మూవీ టీం గతంలోనే జరిగింది. అయితే, వాయిదా పడుతుందనే ప్రస్తుతం రూమర్లు వస్తున్నాయి. అయితే, అక్టోబర్ 10నే వస్తుందని ఈ సాంగ్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చింది వెట్టయన్ టీం..