VenuSwamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి తాజాగా మహిళా కమిషన్ నుండి నోటీసులు జారీ అయినట్లు అందుకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే ఆగస్టు 8వ తేదీన అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు . అక్కినేని నాగార్జున ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వీరి నిశ్చితార్ధాన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఉన్నట్టుండి ఈ నిశ్చితార్థం పై వేణు స్వామి తనదైన రీతిలో కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు.
సమంత – నాగచైతన్య ప్రేమ, పెళ్లి, విడాకులు :
నిజానికి..గతంలో సమంత – అక్కినేని నాగచైతన్యకు వివాహమైనప్పటికీ కూడా ఆ తర్వాత వారు ఇరువురు అంగీకారంతో విడాకులు తీసుకోవడం జరిగింది. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు 2021 లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరు విడాకులు తీసుకోకముందే వేణు స్వామి నాగచైతన్య – సమంత విడాకులు తీసుకుంటారంటూ హాట్ బాంబు పేల్చారు. ఆ సమయంలో ఈయనను విమర్శించారు. కానీ ఈయన చెప్పినట్టుగానే వీరిద్దరు విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని ఆయనను అందరూ బాగా పాపులర్ చేశారు కూడా.
శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం.
అయితే ఇప్పుడు దానికి ఎక్స్టెండెడ్ గా నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకోవడంతో వీరిద్దరూ కూడా విడిపోతారని, అయితే వీరిద్దరూ మూడు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటారని, దీనికి తోడు నాగచైతన్య – శోభిత తల్లిదండ్రులయ్యే యోగ్యం లేదని, పైగా నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశం లేదు అంటూ జాతకం ప్రకారం కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఆయన నోటి దూలకు తగిన శాస్తి జరిగింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ విషయంపై వేణు స్వామికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
వేణు స్వామికి నోటీసులు..
నిరాధారిత వ్యాఖ్యలు చేయడం వల్లే తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కి అటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామి పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించి ఈరోజు మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరేళ్ల శారద స్పందిస్తూ.. వేణు స్వామికి సమన్లు జారీ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈనెల 22వ తేదీన వ్యక్తిగతంగా వేణు స్వామి హాజరు కావాలంటూ ఆ నోటీస్ లో తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు కాస్తా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి ఆగస్టు 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కాబోతున్న వేణు స్వామి ఎలాంటి విషయాలను వెల్లడిస్తారు అనే విషయాలు హాట్ టాపిక్ గా మారడం గమనార్హం. ఏది ఏమైనా వేణు స్వామి నోటి ధూల ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిందని అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.