Venu Swamy VS Murthy : : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రముఖులకు జాతకాలు చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యాడు. తన కెరియర్ లో వేణు స్వామి చెప్పిన జాతకాలు సక్సెస్ కంటే ఫెయిల్ ఎక్కువయ్యాయి. ఎక్కువ శాతం ఏది నిజం కాదు. ఏదో ఒకటి రెండు మాత్రం అలా అలా తగులుతూ ఉంటాయి. నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ అప్పట్లో వేణు స్వామి జాతకం చెప్పిన విషయం తెలిసిందే. అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం జరిగింది.
ఇక రీసెంట్ గా నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అందరూ ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్లు హ్యాపీగా ఉంటున్నారు. నాగచైతన్య మరో పెళ్లికి సిద్ధమైన సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలిపితే వేణు స్వామి మాత్రం మరొకసారి వీళ్ళ జాతకాన్ని చెప్పాడు. వీరిద్దరు కూడా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. అయితే దీనిని చాలామంది ఖండించారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సంఘం కూడా దీన్ని ఖండిస్తూ కేసు నమోదు చేశారు.
ఈ కేసు నమోదు చేయటం వలన వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి రియాక్ట్ అయింది. తాను కూడా గతంలో జర్నలిస్ట్ గా పని చేశాను అంటూ జర్నలిస్టుల మీద హెవీ కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అయితే దర్శకుడు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వీటిని ఖండిస్తూ ఒక డిబేట్ ను పెట్టారు. ఆ డిబేట్ చిలికి చిలికి గాలి వానలా చాలా దూరం వెళ్ళిపోయింది. మూర్తి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాలను చూపిస్తూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు అనేది వాస్తవం. దీనికి సరైన సమాధానం ఇవ్వలేక మూర్తి తమను ఐదు కోట్లు డిమాండ్ చేశారు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు వీణ శ్రీవాణి వేణు స్వామి కలిసి. అదే వీడియోలు చనిపోతాను అంటూ కూడా చెప్పారు.
ప్రస్తుతం జర్నలిస్టు మూర్తి తనమీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నేను ఐదు కోట్లు అడిగినట్లు ప్రచారం చేస్తూ అంటూ వేణు స్వామి, వీణ శ్రీవాణి లపై కేసు పెట్టారు. నేడు జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కలిసి అధికారికంగా కేసు ఫైల్ చేసారు.