Venu Swamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu swamy) హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి ఈయన చెప్పిన జాతకం నిజమైతే.. ఈయనను గద్దెనెక్కిస్తున్న నెటిజన్స్, అదే జ్యోతిష్యం ఫ్లాప్ అయితే మాత్రం పూర్తిస్థాయిలో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా టీవీ5 మూర్తితో జరిగిన విభేదాల కారణంగా మూర్తి తనను హత్య చేయాలని చూస్తున్నాడని , రూ .5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, తమ జంటకు ప్రాణహాని ఉంది అంటూ.. రక్షించండి అంటూ.. రకరకాల ఫోటోలు, వీడియోలతో వేణు స్వామి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. దీంతో మూర్తి వేణు స్వామి పై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వేణుస్వామి పై కోర్టులో పిటిషన్ వేసిన టీవీ 5 మూర్తి..
అసలు విషయంలోకి వెళ్తే..తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు 17వ MM కోర్ట్ వేణు స్వామి పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో మోసం చేస్తున్నారని, ప్రధాన మంత్రి ఫోటోని మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని టీవీ5 మూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో వేణు స్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్రపన్నారని, తనకు హాని తలపెట్టాలని వేణు స్వామి చూస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, దయచేసి వేణు స్వామి నుండి తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ లో టీవీ5 మూర్తి కోరడంతో అతని వాదనలు విన్న కోర్టు అతడితో ఏకీభవించి వేణు స్వామి పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది.
వేణు స్వామి గుట్టురట్టు చేసిన టీవీ5 మూర్తి..
అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే.. టీవీ5 మూర్తి గతంలో వేణు స్వామి ప్రధాని నరేంద్ర మోడీతో దిగిన ఫోటో చూపించి తెగ వైరల్ అయ్యారు. మోడీతో దిగినట్లుగా ఉన్న ఫోటో మరింత ఇమేజ్ ను ఆయనకు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సినీ,రాజకీయ నాయకులు ఆయన వద్దకు క్యూ కట్టినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ ఫోటోపై అనుమానం రావడంతో ఇది ఒరిజినలా? ఫేకా ?అన్నది తేల్చాలి అని డిసైడ్ అయినట్లు మూర్తి చెప్పుకొచ్చారు. దీంట్లో భాగంగా కొంతమంది మిత్రులతో కలిసి సమాచార హక్కు చట్టం కింద ప్రధాని నరేంద్ర మోడీని వేణు స్వామి కలిసారా? ఫోటో దిగారా? అన్న వివరాలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా.. దీనిపై స్పందించిన పీఎంఓ కార్యాలయం అలాంటిదేమీ లేదని సమాధానం తెలిసింది. ఇక ఆ ఫోటో ఎక్కడిది అని ఆరా తీయగా అది అస్సాం ముఖ్యమంత్రితో దిగినట్లుగా తేలిందని మూర్తి తెలిపాడు సీఎం ముఖాన్ని తీసేసి ఆ ప్లేస్లో మోడీ ముఖాన్ని మార్ఫింగ్ చేసినట్లుగా నిర్ధారించారు. ఇక దాంతో వేణు స్వామిని లైవ్ లోకి తీసుకొచ్చి.. ప్రధాని ఫోటోని ప్రచారానికి వాడుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతాయనే ఉద్దేశంతో లైవ్ షో చేశారు. అయితే దీనిని తప్పుగా తీసుకున్న వేణు స్వామి.. అతడి కుట్రలు బయటపెట్టాడని నన్ను హతమార్చే ప్రయత్నం చేశారంటూ కోర్టులో పిటిషన్ వేసారు మూర్తి. ఇప్పుడు మూర్తికి అండగా కోర్టు నిలుస్తూ వేణు స్వామి పై కేస్ ఫైల్ చేయాలని పోలీసులకు ఆదేశాలు పంపింది.