Venu swami: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి (Venu swami) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది సినిమా వాళ్ళ జ్యోతిష్కం తో పాటు, ప్రముఖ రాజకీయ నాయకుల జ్యోతిష్యం కూడా చెబుతూ ఉంటారు. ఇకపోతే వేణు స్వామి చెప్పిన జాతకాల్లో సమంత నాగచైతన్య విడిపోతారని ఒకప్పుడు చెబుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా అది జరిగింది. అయితే వేణు స్వామి చెప్పిన చాలా జాతకాల్లో అతి తక్కువ మాత్రమే నిజమయ్యాయి. నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఏమాయ చేసావే (Ye Maaya Chesave) అనే సినిమాతో దగ్గర అయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమ వరకు దారి తీసింది. వీరిద్దరూ కలిసి రెండు సాంప్రదాయాలలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత వారికున్న వ్యక్తిగత కారణాల వలన ఇద్దరు విడిపోయారు. అయితే మీరు విడిపోవడానికి అంటే కొన్ని రోజులు ముందే వీరు విడిపోతున్నారు అంటూ వేణు స్వామి జాతకం చెప్పారు. అయితే దీనికి కౌంటర్ గా ఒక వ్యక్తి పబ్బులో ఇద్దరు మాట్లాడుకుంటున విషయాన్ని ఈయన చాటుగా వినడం వలన ఇలా చెప్పాడు అంతే తప్ప ఈయనకి జాతకాలు ఏవి తెలియదు అంటూ అప్పట్లో చెబుతూ వచ్చాడు.
ఇక వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి (Veena Sreevani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీణ వాయించడంలో ఆమెకు మంచి నైపుణ్యత ఉంది. ఇంతకుముందు జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. ఇక రీసెంట్ గా కొన్ని మీడియా ఛానల్స్ వేణు స్వామిని ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ వేణు స్వామిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కూడా కౌంటర్ గా చాలామంది స్పందించారు. వీరి మీద కేసు కూడా నమోదు చేశారు. ఇక రీసెంట్ గా వీణ శ్రీవాణి మరొక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నాగచైతన్య(Naga Chaitanya)కు, శోభిత(Sobitha)కు కంగ్రాట్స్ చెబుతూ వాళ్ల విషయాన్ని పక్కన పెట్టేసి కొంతమంది సోకాల్డ్ మెంబర్స్ తమన్న పర్సనల్గా టార్గెట్ చేశారు అంటూ చెప్పకు వచ్చింది. అలానే తనకు ఒక చిన్న బ్యాక్ గిఫ్ట్ కావాలి అంటూ డిమాండ్ కూడా ఆ వీడియోలో చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.