నటసింహం నందమూరి బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా.. క్రాక్ ఫెమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ” వీర సింహారెడ్డి”. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్ లతో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి.
Read More: V.V.Vinayak: ఛత్రపతి హిందీ ట్రైలర్.. ఎదో తేడాగా ఉందే?
జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జనవరి 6వ తేదీన ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా అదే రోజున ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read More: Game Changer Movie: శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే!
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...