Vaishnavi Chaitanya.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఎక్కువగా షార్ట్ ఫిలిం చూసే వారికి ఈమె బాగా సుపరిచితురాలు. కానీ ఎప్పుడైతే సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందో అప్పటి నుంచి ఈమె బాగా పాపులర్ అయ్యింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం బేబీ ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు సక్సెస్ కావడం కష్టమని ఇండస్ట్రీలో చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాలను, నెగిటివ్ సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసింది వైష్ణవి చైతన్య.
వరుస అవకాశాలతో వైష్ణవి చైతన్య..
నటించాలనే కోరిక, సక్సెస్ అందుకోవాలనే తపన రెండూ కూడా ఈమె కెరియర్ కు పునాదులు వేసాయి. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేత ప్రశంసలు అందుకుంది అంటే ఇక ఈమె నటన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీలు వైష్ణవి చైతన్యకు అండగా నిలవడమే కాదు పలు అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు కూడా.. గతంలో హీరోలకు చెల్లి క్యారెక్టర్ లో నటించిన ఈమె ఈసారి ఏకంగా హీరోయిన్గా నటించి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు.
సిద్దు జొన్నలగడ్డ సరసన మూవీ..
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ కు జోడీ గా ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది వైష్ణవి చైతన్య. ఈ సందర్భంగా ఈమె బాల్యం గురించి , అలాగే ఆర్థిక ఇబ్బందుల గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ విషయాలను ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కూడా.
తినడానికి తిండి కోసం అలా చేశా..
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. మా నాన్నకు సినిమాలంటే చాలా ఇష్టం.. నాన్న చిరు వ్యాపారి.. నాన్నకు బిజినెస్ లో నష్టం రావడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ముఖ్యంగా మా కష్టాలు ఎవరికీ చెప్పుకోలేనివి. ఎంత కష్టపడ్డామంటే ఒకసారి ఒక బర్తడే పార్టీలో నేను డాన్స్ వేస్తే నాకు 700 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులే నా మొదటి సంపాదన. ఆ డబ్బును నేను ఇంటికి తీసుకెళ్లి అమ్మకి ఇస్తే, అమ్మ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఆరోజు ఆ డబ్బులతోనే బియ్యం కొని కడుపునిండా అన్నం తిన్నాము. అని తెలిసిన తర్వాత మా ఆనందానికి అవధులు లేవు. ఇక అంత దుర్భర పరిస్థితుల్లో మేమున్నామంటే మా ఆర్థిక పరిస్థితి ఎంతగా చితికిపోయిందో అర్థం చేసుకోండి అంటూ తన బాధను బయటపెట్టింది వైష్ణవి. ఇకపోతే ఇండస్ట్రీ లోకి వస్తా అన్నప్పుడు బంధువులే హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఆమె ఎదుర్కొందట. ఇక ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పి కంటతడి పెట్టించిన వైష్ణవి చైతన్య.. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వినాయకుడి మండపాల్లో లడ్డూలు దొంగలించి రాబిన్ హుడ్ లా అందరికీ పంచి పెట్టిన సందర్భాలు కూడా మాకు ఎన్నో ఉన్నాయి అంటూ సరదాగా నవ్వించింది.