Usha Uthup: పతీ వియోగం పొందిన ప్రముఖ గాయని.. షాక్ లో ఇండస్ట్రీ..!

Usha Uthup.. భారతీయ పాప్ ఐకాన్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉషా ఉతుప్ తాజాగా పతీ వియోగం చెందారు.. ఈమె భర్త జానీ చాకో కోల్కతాలో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు మీడియాతో దృవీకరించారు. 78 ఏళ్ల జానీ తన నివాసంలో.. సోమవారం రోజు టీవీ చూస్తున్నప్పుడు అసౌకర్యానికి గురయ్యారట. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఉషా భర్త మరణానికి పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Usha Uthup: Popular singer who lost her husband.. Shocked in the industry..!
Usha Uthup: Popular singer who lost her husband.. Shocked in the industry..!

ఉషా ఉతుప్ భర్త ఇక లేరు..

ఉష రెండో భార్య . జానీ కి తేయాకు తోటల రంగంతో మంచి అనుబంధం కూడా ఉంది.. 70వ దశకంలో ఐకానిక్ ట్రింకాస్ లో వీరిద్దరూ కలుసుకున్నారట. ఇక తర్వాత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు.. ఇక ఈమె రెండో భార్య కావడం గమనార్హం. వీరికి ఒక కుమారుడు , కుమార్తె కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఉషా కెరియర్..

ఉష విషయానికి వస్తే.. 76 సంవత్సరాల వయస్సున్న ఈమె ఇటీవల భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ తో సత్కరించబడింది. చెన్నై నైట్ క్లబ్లో తన గాన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. ఢిల్లీ నైట్ క్లబ్లో లెజెండ్రీ నటుడు దేవ్ ఆనంద్ చేత గుర్తించబడి 1971 లో హరే రామ హరే కృష్ణ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది.. 1970 , 80 డిస్కో యుగంలో సంగీత స్వరకర్తలు బప్పి లహరి , ఆర్డి బర్మన్ ల కోసం వన్ టూ చాచా, హరి ఓం హరి, రంబా, కోయి యెహన ఆహా నాచే నాచే నాకా బందీ వంటి అనేక పాటలు పాడారు. అంతేకాదు ఈమె కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో వందేమాతరం, 7 ఖూన్ మాఫా లో డార్లింగ్, దృశ్యం 2 టైటిల్ ట్రాక్ కూడా వాడారు.. తెలుగు, తమిళ్, మలయాళం తో సహా పలు చిత్రాలలో కూడా పాడి మంచి పేరు దక్కించుకున్నారు ఉషా.

- Advertisement -

ఉషా అవార్డులు..

తెలుగు విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కీచురాళ్ళు చిత్రంతో కీచురాళ్ళు అనే పాట పాడి మరింత పాపులారిటీ దక్కించుకుంది ఉష.. ఇక తన పాటలతో గానస్వరంతో ఎంతోమంది శ్రోతలను అలరించింది ఇకపోతే అత్యంత ప్రజాదారణ పొందిన కొన్ని హిట్ పాటలకు ఈమె ప్రసిద్ధి చెందింది.. హస్కీ వాయిస్ దేశ విదేశాలలో కూడా తన లైవ్ ప్రోగ్రాం అన్నింటికీ ఈమె ధరించే కష్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. కాంచీపురం పట్టు చీర కట్టుకొని పెద్ద బొట్టు పూలు ఆమెకు భారతీయ పాప్ సంగీతంలో ప్రత్యేకమైన స్థానాన్ని అందించాయి.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో పద్మశ్రీ , పద్మ భూషణ్ అవార్డులను కూడా అందుకుంది. అలాగే ఫిలింఫేర్ అవార్డులు, స్క్రీన్ అవార్డులు, మిర్చి మ్యూజిక్ అవార్డులతో పాటు ఏషియన్ ఫిలిం అవార్డ్స్, కళాకారు అవార్డులు ఇలా ఎన్నో అవార్డులు దక్కించుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు