Upendra About Cooli: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులలో లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా నగరం అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే సినిమా నగరం పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా నటించారు. చాలామందిని తన డైరెక్షన్ తో ఆశ్చర్యపరిచాడు లోకేష్. ఈ సినిమా తర్వాత లోకేష్ కార్తీతో ఖైదీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఖైదీ(Khaidhi) సినిమా ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుందా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కార్తీ(Karthi) నటించిన ఈ సినిమా లోకేష్ కు విపరీతమైన పేరును తీసుకొచ్చింది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించాడు లోకేష్. ఒక సినిమాగా ఖైదీని చూసినప్పుడు చాలా బాగా అనిపించిన విక్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖైదీ సినిమా మీద ఇష్టం చాలా మందికి మరింత పెరిగిపోయింది అలానే ఖైదీ 2 సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 500 కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది. కమల్ హాసన్ కెరియర్లో స్ట్రాంగెస్ట్ కం బ్యాక్ ఫిలిం అయింది. ఇక ఆ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు.
నేను ఆయనకు పెద్ద ఫ్యాన్
విక్రమ్ సినిమా తర్వాత వచ్చిన లియో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దీని గురించి అధికారక ప్రకటన కూడా చిత్ర యూనిట్ ఇదివరకే ఇచ్చింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
నాకు స్టోరీ చెప్పకండి
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లోకేష్ కనకరాజ్ ఉపేంద్రకు ఒక లైన్ చెప్పగానే, నాకు ఇంక ఏమీ చెప్పకండి నేను ఆల్రెడీ ఈ సినిమా చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారట. అంతేకాకుండా రజనీకాంత్ లాంటి హీరో పక్కన నేను ఈ సినిమాలో కనిపించబోతున్నాను. నాకు అదే చాలా ఆనందంగా ఉంది నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ అండ్ చెప్పుకొచ్చారు ఉపేంద్ర. లియో సినిమా తర్వాత లోకేష్ చేస్తున్న సినిమా ఇది. ఇదివరకే జైలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రజినీకాంత్ ను లోకేష్ ఎలా చూపిస్తాడు అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. ఇదివరకే సీనియర్ సూపర్ స్టార్ కమలహాసన్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లోకి ఇక రజనీకాంత్ కి ఏ స్థాయి హిట్ ఇస్తాడు అని చాలామంది ఊహిస్తున్నారు.