Upasana.. మెగా కోడలిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన (Upasana) రామ్ చరణ్ (Ram Charan)కు భార్య కాకముందే అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా మంచి పేరు సొంతం చేసుకుంది.అపోలో లో కీలక బాధ్యతలు పోషిస్తూ అపోలోని విస్తరించడమే కాకుండా మరికొన్ని కొత్త రకాల బిజినెస్ లు ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలవడమే కాదు ఆర్థికంగా కూడా ఆమె వృద్ధి చెందుతోంది. ఇకపోతే తాను ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడమే కాదు తనతో పాటు చాలామంది యంగ్ మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తానని చెబుతోంది. మరి ఉపాసన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యువతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మెగా కోడలు..
తాజాగా హెల్త్ కేర్ రంగంపై ఎక్కువ ఫోకస్ చేసిన ఈమె యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ అందించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఈమె అక్కడ మాట్లాడుతూ.. ఎవరైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో.. అలాంటి యువ మహిళల కోసం తాను చూస్తున్నాను అంటూ తెలిపింది. నేను మీ కో ఫౌండర్ అవుతాను. మీ పార్ట్నర్ అవుతాను. మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాము. ఇండియాలో హెల్త్ కేర్ సిస్టం ని చేంజ్ చేయడానికి మీరు కూడా ముందుకు రండి అంటూ పిలుపునిచ్చింది.
వ్యాపారంలో పార్ట్నర్..
అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా.. మహిళలు ఎదిగేందుకు , అభివృద్ధి చెందేందుకు వ్యవస్థను నిర్మించడానికి మీరు నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్, మీ బిజినెస్ ఎవరిపై ప్రభావం చూపుతుంది ,అసలు మీ బిజినెస్ మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది. నన్ను ఎందుకు మీరు మీ కో ఫౌండర్ గా కోరుకుంటున్నారు వంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్సైటులో సబ్మిట్ చేయండి అంటూ తెలిపింది ఉపాసన మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హెల్త్ కేర్ రంగంలో రాణించాలనుకుంటే మీ ఆలోచనలతో ఉపాసన ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలా ఇప్పుడు దేవరాలకు ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉపాసన కెరియర్..
ఉపాసన విషయానికొస్తే.. రామ్ చరణ్ సతీమణిగా మరింత పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు భర్త ఆలనా పాలనా చూసుకుంటూ.. తన కూతురు క్లీన్ కారా వ్యవహారాలతో పాటు ఇలా బిజినెస్ రంగంలో కూడా మరింత బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు యంగ్ మహిళలకు సహాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది. ఏది ఏమైనా ఉపాసన మంచి మనసు మరొకసారి నిరూపితమైందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడమే కాదు కరోనా వచ్చినప్పుడు, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై కూడా చర్చించింది. ఎంతో మందికి అండగా నిలిచిన ఉపాసన ఇప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే, తన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా సహాయం చేస్తానని చెబుతోంది. దీంతో మరోసారి మంచి మనసున్న అమ్మాయిగా పేరు దక్కించుకుంది.
View this post on Instagram