Trisha Krishnan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జోడి సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించింది. అలా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అంతే ఆ సినిమా అనంతరం త్రిష వెనుతిరిగి చూసుకోకుండా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది.
కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్, కన్నడ భాషలలో సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరోయిన్గా నిలిచింది. ఇక గత కొంతకాలం నుంచి తెలుగులో సినిమాలు చేయడం లేదు. త్రిష (Trisha Krishnan) కొద్ది రోజుల క్రితం పోన్నియిన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కు మించిన అందంతో త్రిష ప్రేక్షకులను ఆకట్టుకుంది. 40 పదుల వయసులోనూ త్రిష ఏ మాత్రం తరగని అందం, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ త్రిష అందం ఏమాత్రం తరగడం లేదు. ఇదిలా ఉండగా…. యాక్షన్ చిత్రాల్లో నటించి, యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.
ప్రస్తుతం అతను చెన్నైలో తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అతనికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు సినిమాల్లో రాణించగా, రెండో కుమారుడు వైద్యుడిగా పని చేస్తున్నాడు. అయితే భానుచందర్ (Bhanu chander) ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఒకప్పుడు త్రిషది (Trisha Krishnan) . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన మొదట్లో తాను నటించిన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత వేరే ఇంటికి మారడంతో ఆ ఇల్లు భానుచందర్ విక్రయించారు. అనంతరం భానుచందర్ ఆ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఇంటి చుట్టుపక్కల పచ్చని చెట్లతో నింపేశారు.
ఈ విషయం తాజాగా బయటకు రావడంతో ఆ ఇల్లుని త్రిష అతనికి రాసి ఇచ్చిందని పుకార్లు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ముందు త్రిష చెబితే కానీ తెలియదు. ఇక త్రిష ఇటీవలే హీరో విజయ్ నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇప్పటివరకు ఎలాంటి సినిమాల్లో త్రిష స్పెషల్ సాంగ్స్ చేయలేదు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినందుకుగాను భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా 1.2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. స్పెషల్ సాంగ్ చేసినందుకు త్రిష (Trisha Krishnan) ఇంత డబ్బులు తీసుకుందని తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. తమిళ హీరో విజయ్ మరియు త్రిష్ (Trisha Krishnan) మధ్య రిలేషన్ షిప్ ఉందని ఇప్పటికీ జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.