Tollywood Heroine.. టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్. 2014లో వచ్చిన నేనొక్కడినే సినిమాతో తెలుగులో మొదటిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో మాత్రం తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించిన కృతి సనన్ పై అటు సినిమాల విషయంలో, ఇటు ఎఫైర్స్ విషయంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో రూమర్స్ ఈమె పైన వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక రూమర్ కూడా వినిపించింది. అయితే ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
నిశ్చితార్థం చేసుకున్న కృతి సనన్..
ఇప్పుడు తాజాగా కృతి సనన్ తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడైన కబీర్ బాహియా తో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఈ పోస్ట్ పెట్టింది ఎవరా అని కృతి ఫాన్స్ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ పోస్ట్ పెట్టింది ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు. సోషల్ మీడియా ద్వారా కృతి సనన్ నిశ్చితార్థం గురించి ఒక పోస్ట్ పెట్టడంతో.. ఈ విషయం కాస్తా పెను దుమారాన్ని సృష్టిస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం అభిమానులు ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
కృతి కాబోయే భర్త ఆస్తి విలువ రూ .45 వేల కోట్లు..
కృతి ఫ్యాన్స్ ఈ విషయం పైన ఫైర్ అవుతూ.. అసలు నీకు బుద్ధి ఉందా? ఇకనైనా మారవా? అంటూ ఉమైర్ సందు ను తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా కబీర్ ఆస్తి విలువ సుమారుగా రూ.45 వేల కోట్లకు పైగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కబీర్ కూడా ప్రముఖ ఇండియన్ క్రికెట్ హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోని కి మంచి మిత్రుడు అన్నట్లుగా తెలుస్తోంది. మరి కబీర్, కృతి సనం ఎంగేజ్మెంట్ పైన ఎవరు ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.
కృతి సనన్ సినిమాలు..
కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే.. మొదటిసారి మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తన అందచందాలతో నటనతో, యువతను విస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్యకు జోడిగా దోచేయ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దాంతో బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడ వరుస సినిమాలు చేస్తూ బాగానే పేరు సంపాదించింది. ఇక ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో మెప్పించింది. ఆ సమయంలోనే ఈమె ప్రభాస్ తో కాస్త చనువుగా ఉండడంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా ఇవన్నీ వట్టి పుకార్లంటూ కొట్టి పారేసింది. ఆ సమయంలో కూడా ఉమైర్ సందు వీరిపై ఇలాంటి రూమర్స్ సృష్టించారు. ఇప్పుడు మరొకసారి ఇలాంటి రూమర్స్ సృష్టించడంతో కృతి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Breaking news 📰: #KritiSanon is engaged 💍 to her Boyfriend #KabirBahia in Greece 🇬🇷 last week !!! Kabir is 9 years younger than Kriti Aunty. pic.twitter.com/5e6k25JZu9
— Umair Sandhu (@UmairSandu) August 6, 2024