Tollywood Heroine.. ఈ మధ్యకాలంలో పెళ్లి అనగానే చాలామంది చాలా సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి, ఆ తర్వాత చిన్న చిన్న విభేదాలకే విడిపోతూ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. అలా ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ స్టార్ హీరోయిన్ కుటుంబానికి మాత్రం అసలు పెళ్లిల్లే అచ్చి రావడం లేదు అనే వార్త తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అంతేకాదు ఆమె తండ్రి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరి ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె తండ్రి ఎవరు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
నటిగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్..
ఆమె ఎవరో కాదు రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar). ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి పేరు సొంతం చేసుకున్న ఈమె మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువగా సినిమాలు చేసింది. అంతేకాదు అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందించి వీరిద్దరిది హిట్ పెయిర్ అంటూ బిరుదు కూడా ఇచ్చింది. తెలుగు తో పాటు తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసింది రాధిక. ఇక సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటించింది. ఆ సీరియల్స్ ను నిర్మించింది కూడా.. అలా ఒకవైపు నటిగా , మరొకవైపు నిర్మాతగా కూడా మంచి పేరు దక్కించుకుంది
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న రాధిక తండ్రి..
ప్రస్తుతం పలు చిత్రాలలో తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్న రాధిక ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధా ( M.R.Radha)కుమార్తె. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న నటుడు ఈయన. ఈయన ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రేమావతి , ధనలక్ష్మి, సరస్వతి, జయమ్మాళ్ల తో పాటు శ్రీలంకకు చెందిన గీత అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నారు. ఇలా మొత్తం ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఈయనకు 5 మంది భార్యల ద్వారా 12 మంది పిల్లలు సంతానంగా కలిగారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాధిక శరత్ కుమార్..
ఇక వారిలో ఎం.ఆర్.రాధా చివరి భార్య అయిన శ్రీలంకకు చెందిన గీతా కు జన్మించిన వారే రాధిక. ఈమెకు చెల్లెలు కూడా ఉంది. ఆమె నిరోష. నిరోషా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక రాధిక విషయానికొస్తే.. ఈమె కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్ ను వివాహం చేసుకున్న ఈమె, అతడితో విభేదాలు వచ్చి అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత రిచర్డ్ హార్డ్ ను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి జీవించలేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది రాధిక. అయితే మరొకవైపు శరత్ కుమార్ కి కూడా అంతకుముందే పెళ్లి జరిగి వరలక్ష్మి శరత్ కుమార్ జన్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాధిక శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుంది. మొత్తానికైతే ఈ కుటుంబానికి పెళ్లిళ్లు అచ్చి రావడం లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.