Tollywood Heroine.. టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) తొలిసారి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన చిత్రం జోష్ ( Josh ). ఇందులో అలనాటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తె కార్తీక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అదే సినిమాతో హైదరాబాద్ ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి (Shreya dhanvantari)కూడా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో కాలేజీలో చైతూ కి భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఈమె కనిపించి ఆకట్టుకుంది.. కళాశాలలో ఏ గ్యాంగ్ లో చేరినా . నాగచైతన్యకు.. తమదే బెస్ట్ గ్యాంగ్ అని చెబుతూ తనను తాను పరిచయం చేసుకుంటుంది.
బాలీవుడ్ లో బిజీగా మారిన శ్రేయ ధన్వంతరి..
ఇకపోతే ఈ సినిమాతో ఈమెకు ఒక మోస్తారు గుర్తింపైతే లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకున్న ఈమె దుల్కర్ సల్మాన్ నటించిన చుప్ అనే సినిమా తో మంచి పేరు అందుకుంది. ఇక గన్స్ అండ్ గులాబ్స్, స్కామ్ 1992, ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలు అందుకుంది. ఇకపోతే టాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీ సినిమాలు నౌషికియే , అద్భుత్ వంటి చిత్రాలలో నటిస్తోంది.
దెయ్యం గెటప్ లో భయపెట్టేసిన చైతూ హీరోయిన్..
ఇకపోతే అద్భుత్ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లు , ఓటీటీ లలో విడుదల చేయకుండా, నేరుగా టీవీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా సోనీ మ్యాక్స్ లో ప్రీమియం కానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ సినిమా తగ్గట్టుగా చాలా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తన రోల్ మేకప్ కు సంబంధించిన ఫోటోలను శ్రేయ అభిమానులతో పంచుకుంది. దెయ్యం మేకప్ తో సడన్గా అందర్నీ భయపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ . దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఈమె దెయ్యం పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అద్భుత్ మూవీ సెప్టెంబర్ 15వ తేదీన సోనీ మ్యాక్స్లో ప్రీమియం కాబోతోందని సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది..? శ్రేయ ధన్వంతరి తన నటనతో ఎలా ఆకట్టుకుంటుంది? అనే విషయాలను తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.మొత్తానికి అయితే దెయ్యం గెటప్ లో అందరిని భయపెట్టేసింది శ్రేయ ధన్వంతరి.
శ్రేయ ధన్వంతరి కెరియర్..
ఇక ఈమె కెరియర్ విషయానికొస్తే, ఎక్కువగా హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటించిన ఈమె ది ఫ్యామిలీ మ్యాన్ లో జోయా పాత్ర పోషించి మంచి పేరు దక్కించుకుంది . 2019లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఈమెకు మంచి ఇమేజ్ ను అందించిందని చెప్పవచ్చు. ఇక ఏమే 1988 ఆగస్టు 29న హైదరాబాదులో జన్మించింది . రెండు నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ కి వెళ్ళిపోయిన ఈమె మిడిల్ ఈస్ట్, ఢిల్లీలో పెరిగింది.NIT వరంగల్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా అందుకుంది ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2018 లో పాల్గొని మొదటి రన్నర్ గా నిలిచింది.
View this post on Instagram