Tollywood Heroine.. ఈమధ్య కాలంలో హీరోయిన్లు బ్యాచిలర్స్ గా ఉన్నా లేదా హీరోలు బ్యాచిలర్స్ గా ఉన్నా సరే తరచూ వారి పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఒక హీరోయిన్ ఒక వ్యక్తితో కాస్త చనువుగా కనిపించిందంటే చాలు వారిద్దరికీ పెళ్లి చేసేస్తూ ఉంటుంది మీడియా. ఈ క్రమంలోనే తనకు చాలా సార్లు పెళ్లయింది అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) బ్యూటీ.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు(Abhimanyu ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు.
పెళ్లికి సిద్ధమైన కళ్యాణ్ రామ్ బ్యూటీ..
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైపోయి , అక్కడే పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 2016 తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయింది. ఆమె ఎవరో కాదు రమ్య దివ్య స్పందన (Ramya Divya Spandana). నటనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆమెపై వార్తలు మాత్రం తగ్గలేదు. ఆమెకు సంబంధించిన ఏదో ఒక గాసిప్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రమ్య పెళ్లి గురించి మీడియాలో వార్తలు రాగా , త్వరలోనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరగబోతోంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పెళ్లి వార్తలపై స్పందించిన రమ్య..
ఇకపోతే తాజాగా ఈ వార్తలపై రమ్య స్పందిస్తూ.. స్వయంగా క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవం, నా వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా నా పెళ్లి గురించి పుకార్లు రావడం ఇదేమి మొదటిసారి కాదు. దీని గురించి తరచుగా నేను గాసిప్ లు వింటూనే ఉన్నాను. ఈసారి మరొక అడుగు ముందుకేసి ఇతనే వరుడు అంటూ ఒక వ్యక్తి ఫోటో కూడా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. త్వరలో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి అంటూ పుకార్లు కూడా సృష్టించారు. ఇవన్నీ అబద్ధం. పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా పుకార్లు మాత్రమే దయచేసి ఈ విషయాన్ని నాకు నేనుగా తెలిపే వరకు వీటిని నిజమని ఎవరు నమ్మకండి.. అంటూ తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చెప్పుకొచ్చింది.
చాలాసార్లు పెళ్లయింది అంటూ క్రేజీ కామెంట్స్..
మీడియా వారు నాకు ఎన్నోసార్లు ఇప్పటికే పెళ్లి చేసేసారు. ఇక ఎన్నిసార్లు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ పెళ్లయితే మీకు తెలియజేస్తాను కదా.. దయచేసి ఇటువంటి పిచ్చి వార్తలు, పుకార్లు స్ప్రెడ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ఏ సినిమాలో కూడా నటించడం లేదు. కానీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వడానికి రమ్య రెడీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. మరి నిజంగానే రమ్య రీ ఎంట్రీ ఇస్తుందా..? అసలు ఏ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది..?ఒకవేళ తెలుగులోకి వస్తే మళ్ళీ సక్సెస్ అవుతుందా? అనే అభిప్రాయాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. మరి రమ్య రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
View this post on Instagram