Anushka: అనుష్క శెట్టి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్గా నిలిచింది. స్టార్ హీరోలు అందరి సరసన జతకట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అనుష్క (Anushka) సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది.
ప్రస్తుతం అనుష్క సినిమాలపరంగా కాస్త డీల పడిందని చెప్పవచ్చు. సినిమాలలో పెద్దగా నటించడం లేదు. గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క (Anushka) కొద్ది రోజుల క్రితం మిస్ శెట్టి…. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనుష్క ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తన కెరియర్ తానే దెబ్బ తినేలా చేసుకుంది. వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించి తన అభిమానులను నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ ఈ సినిమా అనుష్కకు (Anushka) మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించడంతో ఓ టాలీవుడ్ స్టార్ హీరో అనుష్కకు (Anushka) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఇంకోసారి అలాంటి పాత్రలలో నటించవద్దని…. అలా చేస్తే నీ కెరియర్ దెబ్బతింటుందని చెప్పినట్టు సమాచారం. ఇక ఆ హీరో మరెవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas). వీరిద్దరూ మొదటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వివాహం చేసుకుంటారని కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి కానీ వీటిపై ఇప్పటివరకు అనుష్క, ప్రభాస్ స్పందించలేదు. వీరిద్దరూ వివాహం చేసుకుంటే ఈ జంట ఎంతో అద్భుతంగా ఉంటుందని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.