Tarakarathna : నందమూరి స్టార్ హీరో తారక రత్న ( Tarakarathna ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. ఈయన చేసింది కొన్ని సినిమాలే అయిన స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో పలు బిజినెస్ లు చేసాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ అడుగు జాడల్లో నడవాలని, తాత రాజకీయాలను అందుకోవాలనే కోరికతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. టీడీపీ తరపున ప్రచారం చేస్తూ గుండె పోటుకు గురై అతి చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈయన అందుకున్న అరుదైన రికార్డ్ ఇదే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
నందమూరి తారకరత్న రికార్డు స్థాయిలో ఒక గిన్నిస్ బుక్ రికార్డును కూడా అందుకున్నాడు. ఒకేరోజు 9 సినిమాలతో లాంచ్ అయిన హీరోగా అతను అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు.. ఒకేసారి అన్ని సినిమాలతో అంటే మామూలు విషయం కాదు.. నందమూరి ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక ఆయన తర్వాత మూడవ తరం వారసులు చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ ( NTR ), కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) తర్వాత తారకరాత్న కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..ఇక తారకరత్న గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు 2002లో ఒకేసారి 9 సినిమాలను లాంచ్ చేయడం విశేషం. అప్పట్లో అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలను కూడా వచ్చాయి.
ఈయన మొదట ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కె రాఘవేంద్రరావు ( Raghavendra Rao) దర్శకత్వంలో తెరకెక్కగా కీరవాణి మ్యూజిక్ అందించారు..ఆ తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు ఇలాంటి సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే మొదట తొమ్మిది సినిమాలను లాంచ్ చేయగా అందులో కేవలం ఈ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలు కొన్ని ప్రారంభ దశలోనే ఆగిపోగా మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోయాయి..హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మంచి వ్యక్తిగా మాత్రం ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోయాడు. అతను ఎవరితో కూడా ఇప్పుడు తప్పుగా వ్యవహరించినట్లు లేదు. అందరిని సమానంగా చూసేవాడు అని సన్నిహితులు చెబుతూ ఉంటారు.విలన్ గా అమరావతి అనే సినిమాలో నటించి నంది అవార్డును అందుకున్నాడు..
ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. టీడీపీ యువ నాయకుడు, మంత్రి లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాద యాత్రలో భాగం అయ్యాడు తారక రత్న.. కొన్ని రోజులు ప్రచారం చేసిన ఆయనకు ఆరోగ్యం పాడైంది. పాద యాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు గుండె పోటు వచ్చింది. అది గమనించిన నేతలు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చికిత్స అందుకున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు..