Guess The Actress : ఈ మధ్య కాలంలో సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు, పేరెంట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫోటోలు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని మాత్రం నమ్మలేకుండా ఉన్నాయి. పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక స్టార్ హీరో తండ్రి. అతను కూడా ఒక డైరెక్టర్ ఎవరో గుర్తు పట్టారా? అతని కొడుకు కూడా ఇతని లాగే ఉంటాడు. ఎవరో కనిపెట్టారా? మీరు గెస్ చేసింది కరెక్ట్ ఆయన ఎవరో కాదు జగపతి బాబు తండ్రే.. ఈయన కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా చేశాడు.. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈయన పేరు వీరమాచినేని రాజేంద్ర ప్రసాద్.. కాకినాడలో చదువుకునే సమయంలో పూర్ణోదయా క్రియేషన్స్ ఓనర్ ఏడిద నాగేశ్వర్రావు ఈయనకు క్లాస్ మెట్.ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు ద్వారా మెల్లగా సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన అతనికి కలిగిందట. నటుడు అవుదాం అని వెళ్లిన ఆయన ఒకటి, రెండు ప్రయత్నాలు చేసాక అది తన వల్లకాదని నిర్ణయించుకొని, నిర్మాత అవ్వాలని డిసైడ్ అయ్యారు. నాగేశ్వర్రావు గారి దగ్గరకు వెళ్లి, మీరు నాకు ఒక సినిమా చెయ్యాలి అని అడిగారు. అయితే మీరు ఒక సినిమా చేసి రండి అని చెప్పడంతో అటుగా అడుగులు వేశారట..
సదాశివ బ్రహ్మం అనే రైటర్ దగ్గర ‘అన్నపూర్ణ’ చిత్రం కథ తీసుకొని నిర్మించారు.ఈ చిత్రాన్ని వీ.మధుసూధనరావు దర్శకత్వం వహించగా, జగ్గయ్య, జమున నటించారు. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో తర్వాత అవకాశాలు ఒక్కొక్కటి వెతుక్కుంటూ వచ్చాయి. నాగేశ్వరావు హీరోగా “అదృష్టవంతులు” అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత దసరా బుల్లోడు వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. మధుసూధనరావు దర్శకత్వం చెయ్యడం కుదరదు అన్న ఒక్క మాట వలన దర్శకుడిగా మారిన రాజేంద్ర ప్రసాద్ గారు, తన సినీ ప్రస్థానంలో 13 సినిమాలకు దర్శకత్వం వహించారు… ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత సినిమాలు చెయ్యలేదు. ఇక ఆయన వారసుడుగా జగపతి బాబు సినిమాల్లో రాణిస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఆయన ఇప్పుడు విలక్షణ నటుడుగా , విలన్ పాత్రల్లో మెప్పిస్తున్నాడు. తెలుగులో మాత్రమే కాదు . బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా జగ్గూ భాయ్ యాక్టివ్ గా ఉంటారు. లేటెస్ట్ ఫోటోల గురించి, తన మూవీస్ గురించి అందరికి పలు విషయాలను షేర్ చేస్తున్నాడు. ఈయనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..