Nitya Menon : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిత్యా మీనన్ ( Nitya Menon ) పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ లో నిత్యా నటించిన ప్రతి సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ అయ్యింది. ఇక తెలుగులో ఈ మధ్య పెద్దగా సినిమాలు రాలేదు. కేవలం తమిళ్, మలయాళ సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. నిత్యం నిత్యా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ గురించి ఓ నమ్మలేని నిజం బయటకు వచ్చింది. ఇన్నాళ్లకు ఆమె అసలు నిజాన్ని బయట పెట్టింది. అసలు విషయానికొస్తే..
హీరోయిన్ నిత్యా మీనన్ కేవలం పాత్రకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తుంది. హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నా కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించడానికే ఆసక్తి చూపించడం విశేషం. ఇకపోతే ఈమె ఇటీవల ధనుష్ తో ఓ సినిమా చేసింది. ధనుష్‌తో కలిసి ఆమె చేసిన ‘తిరుచిత్రాంబలం’ మూవీలో నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.. తన పేరులో ఉన్న మేనన్ అనేది తన ఇంటి పేరు కాదని చెప్పింది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఈమె తన అసలు పేరు ఎన్‌ఎస్ నిత్య ( SS Nitya )అని అన్నారు. తన తల్లిదండ్రులు నళిని, సుకుమార్ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని అలా పెట్టుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో ఎవరూ ఇంటి పేరును వాడరని తెలిపారు. ఎందుకంటే కులాన్ని పేర్లతో ముడిపెట్టడం ఇష్టం ఉండదన్నారు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి వస్తుందని పాస్‌పోర్ట్‌లో తన పేరుకు ‘మేనన్’ అని జత చేసినట్లు తెలిపారు. కేవలం న్యూమరాలజీ ఆధారంగానే పేరు పెట్టుకున్నట్లు చెప్పింది. ఇది ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి..
అంతేకాదు మూడు తరాలుగా ఈమె ఫ్యామిలీ బెంగుళూరులో సెటిల్ అయ్యిందని కూడా చెప్పింది. స్కూలింగ్ లో తన సెకండ్ లాంగ్వేజ్‌గా కన్నడ చదివినట్లు వివరించారు. ‘చాలా మంది నేను మలయాళీ అనుకుంటారు. మేము బెంగళూరు వాసులం. ఇప్పటికీ షూటింగ్ కోసం విమాన టికెట్లు బుక్ చేయమని చెబితే, ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఫోన్ చేసి, ‘కొచ్చి నుంచి చేయమంటారా’ అని అడుగుతారు అంటూ నిత్యామేనన్ చెప్పుకొచ్చారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే జయం రవి ( Jayam Ravi ) తో ‘కాదలిక్క నేరమిల్లై’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.