Suriya : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya ) సరికొత్త కాన్సెఫ్ట్ లతో కొత్త సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. తమిళ్ సినిమాలను మాత్రమే కాదు.. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. దాంతో ఇక్కడ కూడా కూడా ఆయనకు క్రేజ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సరికొత్త కథతో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా అవ్వక ముందే కొత్త సినిమాను లైన్లో పెట్టుకున్నాడు. ఆ సినిమాలో పదేళ్ల తర్వాత ఓ హీరోయిన్ నటించబోతుంది. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్య తన 44వ చిత్రం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Krthik Subbaraj ) తో చేయనున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా సూర్య 44 అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సూర్య, కార్తీక్ సుబ్బురాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు పూజా హెగ్డే ( Pooja Hegde ) నటిస్తుంది. సూర్య 44వ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో కూడా సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. తాజాగా ఈ లో నటించే టెక్నికల్ ఆర్టిస్టుల వివరాలను చిత్రబృందం ప్రకటించింది. అలాగే చిత్ర బృందం ఈ చిత్రానికి ‘జైలు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్..
ఈ సినిమాలో హీరోయిన్ నందితా దాస్ ( Nanditha Das) నటిస్తున్నారని టాక్.. దాదాపు పదేళ్ల తర్వాత సూర్య సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.. ఇక కంగువ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఈ సినిమా ట్రైలర్ తమిళ్ వర్షన్ లో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.. ఆ ట్రైలర్ లో బాబీ డియోల్ పెర్ఫార్మన్స్ పీక్స్.. ఒక్కో సీన్ భయంకరమైన విజువల్స్ తో అదరగొట్టాయి పుట్టించింది.. దాంట్లో సూర్య ఎక్ప్రెషన్స్ మైండ్ బ్లాక్.. ఒక్కమాటలో చెప్పాలంటే కిల్లింగ్ అనే చెప్పాలి.. మొత్తానికి ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్ తీసినట్లు బ్యాగ్రౌండ్ విజువల్స్ ను చూస్తే తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.
రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. గతంలో చాలా అప్డేట్స్ ఆ సీన్స్ గురించి చెప్పాయి.. ఇకపోతే టీజర్ అసలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఫైట్స్ గురించి చూసాము. టాలీవుడ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది.. ఈ సినిమా నవంబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని సమాచారం. ఆ తర్వాత ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం..