The Greatest Of AllTime: తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను ఎంతలా ఎంజాయ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు మాత్రమే కాకుండా, మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప వాళ్ళు ఒక సినిమాని ఎంజాయ్ చేయటం వాళ్లకు మాత్రమే సాధ్యం అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విజయ్(Vijay) వంటి స్టార్ హీరోలు కూడా హైదరాబాద్ వచ్చి థియేటర్స్ లో మాస్ కమర్షియల్ సినిమా చూడటానికి ఇష్టపడతారు. కేవలం రిలీజ్ సినిమాలు మాత్రమే కాకుండా రీ రిలీజ్ సినిమాలను కూడా అంతలానే ఎంజాయ్ చేస్తారు తెలుగు ఆడియన్స్.
మామూలుగా ఒకప్పుడు సినిమా అంటే 10 గంటల తర్వాత మొదలయ్యేది కానీ ఇప్పుడు అర్ధరాత్రి నుంచి సినిమా షో లు వేయడం మొదలుపెట్టారు. సలార్(Salaar) వంటి సినిమాలు రాత్రి ఒంటిగంటకు మొదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా వన్ ఓ క్లాక్ షో లు. అలా వేయడం ఆ సినిమాకి సంబంధించి కొద్దిపాటి మైనస్ అయింది. చాలామంది కమర్షియల్ ఆడియన్స్ కి అది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కాబట్టి అంతగా ఎక్కకపోవడం వలన మిక్స్టాక్ వచ్చింది. ఇకపోతే తెలుగు స్టార్ హీరోలకి ఆ టైంలో పడటం అనేది రీసెంట్ ప్లేస్ లో కామన్ అయిపోయింది.
ఇక ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న గోట్ సినిమా సెప్టెంబర్ ఐదున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎర్లీ మార్నింగ్ 5:00 నుంచి షో మొదలవనున్నట్లు తెలుస్తుంది. మామూలుగా తెలుగు స్టార్ హీరోల కోసం మాత్రమే ఇలా వేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఒక తమిళ్ హీరో కోసం ఇలా వేస్తున్నారు అంటే సినిమా మీద ఉన్న నమ్మకమని చెప్పాలి. ఏదేమైనా మార్నింగ్ షో కి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా తేడా కొడుతుంది.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఈ సినిమాలో ఏదో ఉంది అని ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా కొద్దిపాటి ట్రోల్స్ కి గురైంది. విజయ్ ను యంగ్ లుక్ లో చూపించడం చాలామందికి ఎక్కలేదు. మరి సినిమాలో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.