The GOAT.. అసలు భూమి మీదే లేని వ్యక్తిని సినిమాలో చూపించడం ఒక ఎత్తైతే ఆ వ్యక్తికి డబ్బింగ్ చెప్పడం ఇంకో ఎత్తు. సరిగ్గా ఇదే చేసి చూపించారు ది గోట్ చిత్రంలో.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay dalapati)హీరోగా తాజాగా నటించిన చిత్రం గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ చిత్రంలో విజయ్ తో పాటు పలువురు తమిళ సినీ తారలు కూడా నటించారు. ముఖ్యంగా ఇందులో దివంగత నటుడు విజయ్ కాంత్ ను ఏఐ ఉపయోగించి నటింపచేశారు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. సాధారణంగా విజయ్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతాయి. కానీ ఈ సినిమా పాటలు మరియు లుక్ మొదటి నుంచి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ద్విపాత్రాభినయం చేసిన విజయ్..
దీనికి తోడు ఇందులో విజయ్ ను ద్విపాత్రాభినయంలో చూపించి, డీ ఏజింగ్ యాప్ ను ఉపయోగించి తండ్రీకొడుకులుగా చూపించారు. వాస్తవానికి డైరెక్టర్ వెంకట్ ప్రభు.. తండ్రిగా రజినీకాంత్ , కొడుకుగా ధనుష్ ను చూపించాలని అనుకున్నారు. కానీ విజయ్ ను రెండు క్యారెక్టర్లలో చూపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే లుక్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఈ సినిమా మొదటి నుంచి బాగానే ఉన్నా విజయ్ లుక్ మాత్రం సినిమాకు మైనస్ గా నిలిచింది. ఇకపోతే విజయ్.. తండ్రిగా గాంధీ పాత్రలో నటించిగా.. ఈ పాత్రకు స్నేహ జోడిగా నటించింది. కొడుకుగా జీవా పాత్రలో నటించారు విజయ్.ఈ పాత్రకు జోడిగా మీనాక్షి చెలత్రి హీరోయిన్లుగా నటించారు.
ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్..
ఇక అలాగే ఇందులో లైలా, ప్రభుదేవా, జయరాం, ప్రశాంత్, అజ్మల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు డీఎంకే అధ్యక్షుడు విజయ్ కాంత్ అనారోగ్యంతో డిసెంబర్ 28 న గతేడాది మరణించిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ కాంత్ అంటే హీరో విజయ్ కి చాలా గౌరవమని అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన తన సినిమాలో లేడు అనే బాధను ఆయన పడకుండా ఏఐ ఉపయోగించి విజయ్ కాంత్ ను ఇందులో చూపించారు. ముఖ్యంగా ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్ ను సినిమాలో నటింపచేయడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. అంతేకాదు ఇందులో విజయ్ కాంత్ తో డైలాగ్ కూడా చెప్పించారు.
విజయ్ కాంత్ కి డబ్బింగ్ చెప్పింది ఇతడే..
విజయ్ కాంత్ డేటా పేస్ ఏ ఐ లాగా అతని వాయిస్ కూడా ఏ ఐ అని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక ఒక ప్రముఖ నటుడు డబ్బింగ్ ఇచ్చారు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎవరో కాదు గుడ్ నైట్ సినిమా హీరో మణికందన్. ఈయన కెరియర్ మొదట్లో కలకపోవటు ఎవరు ? అనే ప్రముఖ షో లో హోస్ట్ గా పనిచేశారు. ముఖ్యంగా చాలామంది నటీనటుల గొంతులను అనుకరించడం ఈయన హాబీ . అందుకే కెప్టెన్ విజయ్ కాంత్ కి కూడా డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక అసిస్టెంట్ రైటర్ గా కూడా పనిచేసిన ఈయన నేడు పాపులర్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.