The Goat : దళపతి విజయ్ యాక్షన్ ఎంటర్టైనర్ గోట్ మూవీ తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు స్పెషల్ షోలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ సిగ్నల్ కూడా దొరికింది. కానీ తెలుగు వాళ్ళు అంటే నచ్చని హీరో సినిమాకు ఇలా పర్మిషన్ దొరకడం అనేది టాలీవుడ్ మూవీ లవర్స్ కి మింగుడు పడట్లేదు.
గోట్ స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్
విజయ్ గత సినిమాలు లియో, బీస్ట్ వంటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వారసుడు కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గోట్ అదరగొడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోట్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నైజాం ప్రాంతంలో భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలకు ప్లాన్ చేశారు. కానీ నిజానికి విజయ్ తమిళ హీరో కాబట్టి ఎక్కువగా బెనిఫిట్ షోలు తమిళనాడులోనే పడుతుంటాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తెలుగులో కూడా నైజాం ఏరియాలో ఉదయాన్నే నాలుగు గంటలకు గోట్ మూవీ బెనిఫిట్ షోలకు సన్నాహాలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వీరి రిక్వెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సెప్టెంబర్ 5న తెలంగాణలోని థియేటర్లలో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఉదయం నాలుగు గంటలకే ఆరవ షోకు పర్మిషన్ దొరకడంతో ఇక్కడున్న విజయ్ అభిమానులు సంతోషపడుతున్నారు. కానీ తెలుగు మూవీ లవర్స్ కు మాత్రం అసలు ఇలాంటి హీరోల సినిమాలకు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అనే చికాకు మొదలైంది.
టాలీవుడ్ ను పట్టించుకోని హీరోకు ఇదంతా అవసరమా?
సాధారణంగా స్టార్స్ ఏ భాషకు చెందిన వారైనా తమ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటారు. కానీ విజయ్ మాత్రం తన మూవీ ప్రమోషన్స్ కి ఎప్పుడూ తెలుగు స్టేట్స్ లో అడుగు పెట్టడు. కేవలం ఆయన మూవీ టీం మాత్రమే వచ్చి నామమాత్రంగా ప్రమోషన్స్ పూర్తి చేసి వెళ్లిపోతారు. గతంలో వారసుడు అనే మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలుగు వారే అయినప్పటికీ విజయ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. ఇక దిల్ రాజు ఎలాగైనా సరే విజయ్ ని హైదరాబాదుకు తీసుకొస్తానని శపధం చేసినా అది నెరవేరలేదు. ఇప్పుడు గోట్ విషయంలో కూడా ఇదే పని చేశాడు. పైగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల వరదల్లో చాలా ప్రాంతాలు మునిగాయి. కానీ విజయ్ కనీసం దీని గురించి స్పందించలేదు. సెలబ్రిటీలంతా సాయం చేయడానికి ముందుకు వస్తుంటే తన సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా విజయ్ సైలెంట్ గా ఉంటున్నాడు. ఇలాంటి హీరో మూవీకి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వడం అనేది టాలీవుడ్ మూవీ లవర్స్ కి ఏ మాత్రం నచ్చడం లేదు. మరి ఇంత నెగెటివిటీలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.