Kanchana 4 : దెయ్యం సినిమా తర్వాత హారర్ జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో రాఘవ లారెన్స్ (Raghava Lawrance ) స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాల్లో దెయ్యాలకు ఒక కథ ఉంటుంది. తనకు హాని చేసిన వారిని చంపేస్తు మంచి మెసేజ్ ను కూడా ఇస్తుంది. అందుకే ఆ సినిమాలకు ఇండస్ట్రీలో క్రేజ్ ఇప్పటికి అలానే ఉంది. ఇప్పటివరకు 3 సిరీస్ లు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సిరీస్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు. హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్.. ఈ సినిమా గురించి తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ హీరోయిన్ ఇందులో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లకు కాంచన వచ్చేసింది. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా కాంచన 3 వచ్చింది. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఏడేళ్లకు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు లారెన్స్.. కాంచన 4 అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమా లో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తోంది. కాంచన 4 సినిమాకు దాదాపు రూ. 100 కోట్లు బడ్జెర్ట్ లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ మూవీకి మొదటగా హీరోయిన్ ను నయనతార (Nayana Thara ) అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరలేదు. దాంతో ఆ తర్వాతగా పూజా హెగ్డే ( Pooja Hegde ) ను ఎంపిక చేశారు.
ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ప్రస్తుతం పూజా హెగ్డే కు ఉంది. అయితే నాలుగేళ్లుగా ఆమె ఖాతాలో సరైన హిట్ పడలేదు. దీంతో పాపకు అవకాశాలు కూడా తగ్గాయి. ఏవో అలా వచ్చే వాటిలో నటిస్తుంది. ఆమెను తీసుకోవద్దు.. తీసుకుంటే ప్లాఫ్ అవుతుందని లారెన్స్ ఫ్యాన్స్ అంటున్నారు. వేద ( Veda ) లేదా రితికా సింగ్ ( Rithika Singh )లో ఎవరొకరిని తీసుకోమని సలహా ఇస్తున్నారు.. మరి దీనిపై లారెన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఈ సినిమాను త్వరలోనే ప్రకటించనున్నారు..