Johnny Master Case : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master ) పేరు అందరికీ తెలుసు.. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తాడు. ఇంతవరకు ఈయన కంపోజ్ చేసిన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యాయి. మాస్టర్ కొన్ని హుక్ స్టెప్స్ కు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్డం అందుకున్న ఈ మాస్టర్ గారు చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ డ్యాన్స్ మాస్టర్ ను డబ్బులు ఇవ్వకుండా వేదిస్తున్నాడని అతను కేసు పెట్టాడు. అ కేసు పరిస్థితి తెలియదు. కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పీఏం అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. ఇక తాజాగా మరో వివాదం మెడకు చుట్టుకుంది..
గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.. ఇక కేసు ఫైల్ అవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మాస్టర్ ఇలాంటి వాడా అంటూ అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలైంది. ఇక ఫిలిం ఛాంబర్ లో జానీ మాస్టర్ గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 , క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం 323 లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. జనసేన తరపున ప్రచారం కూడా చేశాడు.. ఇకపోతే మాస్టర్ పై గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కేసులు వెలుగులోకి వచ్చాయి. 2015 లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీమాస్టర్‌పై కేసు బుక్కయింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరి ఈవార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి చెప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. మెగా ఫ్యామిలీకి మాస్టర్ నమ్మిన బంటు మరి దీనిపై మెగా హీరోలు స్పందిస్తారేమో చూడాలి..