Thangalaan Trailer Talk : చావును ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం… ట్రైలర్‌లో విక్రమ్ విశ్వరూపం చూడాల్సిందే భయ్యా…

Thangalaan Trailer Talk : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ తంగలాన్. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీపై మూవీ లవర్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో విక్రమ్ లుక్ తో పాటు నటన, ఇతర నటీనటుల మేకోవర్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ ట్రైలర్ కోసం విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. జూలై 10న తంగలాన్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు డైరెక్టర్ పా రంజిత్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరి ట్రైలర్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ట్రైలర్ లో హైలెట్స్ ఇవే

కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ మూవీని డైరెక్టర్ రంజిత్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ కబాలి, కాలా, సార్పట్టా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని నిర్మిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తంగలాన్ ను ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Imageఇందులో విక్రమ్ లుక్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కొన్ని హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అలాగే టెక్నికల్ అంశాలు కూడా హై రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -

విక్రమ్ కు హిట్ పడినట్టేనా?

చియాన్ విక్రమ్ గురించి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎంచుకునే ప్రతి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును దక్కించుకున్న విక్రమ్ ఇప్పటిదాకా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించి మెప్పించారు. కానీ అపరిచితుడు తర్వాత ఈ హీరో కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. ప్రస్తుతానికి తంగలాన్ మూవీపైనే విక్రమ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. నిజానికి ఈ మూవీని 2024 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదే ఏడాది ఏప్రిల్ కు వాయిదా పడింది. కానీ అప్పటికి కూడా మూవీ రెడీ కాకపోవడం, మరోవైపు ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఆగస్టు 15న రిలీజ్ కానున్న తంగలాన్ మూవీకి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు