Thangalaan Trailer : ట్రైలర్‌లో అస్సలు ఊహించని ట్విస్ట్ గమనించారా ? థియేటర్లు బద్దలు అవ్వడం ఖాయం అంతే !

Thangalaan Trailer : చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తంగలాన్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఊహించినట్టుగానే ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అద్భుతంగా ఉంది. అయితే ట్రైలర్ లో అస్సలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ట్రైలర్ లో ఊహించని ట్విస్ట్

కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ మూవీని డైరెక్టర్ రంజిత్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ డైరెక్టర్ కబాలి, కాలా, సార్పట్టా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని నిర్మిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తంగలాన్ ను ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు మేకర్స్. తాజాగా తంగలాన్ ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.

ట్రైలర్ విశేషాల విషయానికొస్తే.. ఒక్కో సీన్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. అక్కడక్కడా గ్రాఫిక్స్ పరంగా కొన్ని సీన్స్ తెలిపోయినట్టు అన్పించినా, ట్రైలర్ ఓవరాల్ గా బాగుంది. ట్రైలర్ ను చివరిదాకా డైలాగులతో నింపేసి, చివరకు మాత్రం అదిరిపోయే బిజీఎంతో ప్రేక్షకులను ఆ ట్రాన్స్ లోకి నెట్టేశారు. ఇక ఇందులో మైండ్ ను బెండ్ చేసే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే? ఇదిలా ఉండగా ట్రైలర్ లోని మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. హీరోకి హీరోయినే ఇందులో విలన్.

- Advertisement -

Chiyaan Vikram's period drama Thangalaan's trailer to DROP soon: Here's what we know | PINKVILLA

తంగలాన్ స్టోరీ ఇదే ?

తంగలాన్ ట్రైలర్ ను గమనిస్తే స్టోరీ ఏంటో అర్థం అవుతోంది. బ్రిటిష్ వాళ్ళు బంగారం తవ్వుకోవడానికి ఓ తెగను వాడుకుంటారు. కానీ ఆ కొండ దగ్గరికి వెళ్లడానికి అక్కడున్న జనాలు భయపడతారు. అక్కడ దయ్యాలు పిశాచాలు ఉన్నాయని ఈ తెగ నమ్మకం. ఆ కొండను తవ్వడం అంటే మన గొయ్యిని మనమే తవ్వుకోవడం అని నమ్ముతుంటారు. కానీ హీరోనే అందరిలో ధైర్యం నింపి ఆ కొండలో బంగారం తవ్వడానికి తీసుకెళ్తాడు. ఈ నేపథ్యంలో వాళ్లు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆ తర్వాత వాళ్లను కొండ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక శక్తి అడ్డుకుంటుందని తెలుసుకుంటారు. అది మాయ, మంత్రాలు కాదు మాంత్రికురాలు ఆరతి అని చెప్తాడు హీరో. అప్పుడే మాళవిక అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్ ఇచ్చారు. ఆమెకు దేవత పూనడం, స్పెషల్ పవర్స్ తో ఆ కొండను కాపాడుతున్నట్టు, ఆమెకు భవిష్యత్తు తెలిసినట్టు ట్రైలర్ లో చూపించారు. మరి మొత్తానికి బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఈ తెగ ఆ కొండను తవ్వకుండా హీరోయిన్ ఎంతవరకు ఆపగలిగింది? చివరకు ఏం జరిగింది అనేది ట్రైలర్ లో చూడాలి. నిజానికి మేకర్స్ స్టోరీని ఇక్కడే రివీల్ చేశారు. పా రంజిత్ స్క్రీన్ ప్లేను ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేయడమే మిగిలింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు