ThalapathyVijay : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, సినిమా మొత్తం రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు తెరకెక్కించాడని, ఇది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం కాదని, వరెస్ట్ అఫ్ అల్ టైం అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా విజయ్ మాత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తో రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాని పెద్దగా పట్టించుకోలేకపోయినా, తమిళ్ లో మాత్రం ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుంది.
సౌత్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న దళపతి…
ఇక విజయ్ నటించిన గోట్ (Goat) సినిమా సౌత్ లో భారీ రికార్డులు సృష్టించింది. దళపతి విజయ్ ఒక ప్లాప్ సినిమాతో కూడా రికార్డ్ వసూళ్లు సాధించడం ఆశ్చర్యమేనని చెప్పాలి. ఈ సినిమా తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అయితే ఇంతకు ముందు విజయ్ నటించిన సినిమాల్లో బిగిల్, వారసుడు, లియో సినిమాలు 300 కోట్ల వసూళ్లు అందుకోగా, ఇప్పుడు నాలుగో సినిమాగా గోట్ సినిమా మరో సారి మూడొందల కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక 300 కోట్ల సినిమాలు ఉన్న హీరోల్లో విజయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
ప్రభాస్ తర్వాత విజయ్ దే స్థానం…
ఇక సౌత్ లో 300 కోట్ల వసూళ్ల సినిమాల్లో అత్యధికంగా ప్రభాస్ (Prabhas) పేరిట 6 సినిమాలు ఉన్నాయి. బాహుబలి, బాహుబలి2, సాహో, ఆది పురుష్, సలార్, కల్కి2898AD సినిమాలతో టాప్ లో నిలిచాడు. ఆ తర్వాత 4 సినిమాలతో విజయ్ ఉండగా, తర్వాత రజినీకాంత్ (Rajinikanth) 3 సినిమాలతో నిలిచాడు. ఇక విజయ్ గోట్ సినిమా వర్కింగ్ డేస్ లో చల్లబడగా, మరో రెండు మూడు రోజులు మాత్రమే మంచి హోల్డ్ చూపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా ఓవరాల్ గా 350 కోట్లకి అటు ఇటుగా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక విజయ్ ప్రస్తుతం సిహెచ్. వినోత్ తో తన చివరి సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.