Thalapathy69 : దళపతి విజయ్ హీరోగా నటించిన “గోట్” సినిమా గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే విజయ్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి సినిమాని కాస్త గట్టెక్కించాడు. అయితే గోట్ సినిమా విజయ్ చివరి సినిమా అని కొన్ని రోజులు ప్రచారం జరగగా, ఇది కాదని, విజయ్ తన 69వ సినిమా చేస్తున్నాడని, అదే విజయ్ చివరి సినిమా అని తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇదిలా ఉండగా దళపతి విజయ్ రాజకీయ అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే “తమిళ వెట్రి కళగం” అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో తన చిట్ట చివరి సినిమాని అనౌన్స్ చేసేసాడు. తాజాగా విజయ్ చివరి సినిమా ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న మేకర్స్ అఫిషియల్ గా నేడు అనౌన్స్ చేసేసారు.
ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్ లోడింగ్..
ఇదిలా ఉండగా చాలా రోజుల నుండే దళపతి విజయ్ లాస్ట్ సినిమా గురించి వార్తలు వస్తుండగా, తాజాగా విజయ్ 69వ ప్రాజెక్ట్ ని (Thalapathy69) మేకర్స్ ఒక సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు. దళపతి విజయ్ నటిస్తున్న ఈ చివరి సినిమాను తమిళ అగ్ర నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ (KVN) ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నిన్ననే విజయ్ కి సంబంధించిన ఓ ఇన్స్పైరింగ్ వీడియోతో మేకర్స్ దళపతి 69 అప్డేట్ సెప్టెంబర్ 14న సాయంత్రం 5 గంటలకు ఉంటుందని ప్రకటించగా, కాసేపటికిందే అఫిషియల్ గా మేకర్స్ ప్రకటించారు. ఇక విజయ్ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ చూస్తుంటే, సినిమా పొలిటికల్ టచ్ నేపధ్య్మలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. పైగా ఆ పోస్టర్ చేతిలో టార్చ్ పట్టుకుని ఉన్నట్టుగా ఉండగా, “ప్రజాస్వామ్యంలో టార్చ్ బేరర్ త్వరలో వస్తాడు” అంటూ కాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్.
రాజకీయ నేపథ్యంలోనే సినిమా ఉంటుందా?
ఇక విజయ్ నుండి తాజాగా వచ్చిన గొట్ సినిమా నిరాశపరిచినా, ఇప్పుడు రాబోయే సినిమా మాత్రం అభిమానుల అంచనాలను మించి ఉంటుందని సమాచారం. పైగా ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలోనే ఉంటుందని వార్తలు ఊపందుకుంటుండగా, రాజకీయ నేపథ్యంలోనే గనుక తెరకెక్కితే, తన రాజకీయ జీవితానికి ఈ సినిమా బిగ్గెస్ట్ బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2025 అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ నుండి రావాల్సి ఉంది.