Thalapathy69 : దళపతి విజయ్ నటించిన “గోట్” సినిమా గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వెంకట్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆ సినిమా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అయితే విజయ్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఓపెనింగ్స్ మాత్రం భారీగానే తెచ్చుకుంది. ఇకపోతే రీసెంట్ గా దళపతి విజయ్ రాజకీయ అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే “తమిళ వెట్రి కళగం” అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ ఇక సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో తన చిట్ట చివరి సినిమాని కూడా అనౌన్స్ చేసేసాడు. ఇక చాలా రోజుల నుండే విజయ్ లాస్ట్ సినిమా గురించి వార్తలు వస్తుండగా, తాజాగా దళపతి విజయ్ (Thalapathy Vijay) ఇన్స్పిరేషనల్ జర్నీ వీడియోతో తన 69వ సినిమా గురించి అప్డేట్ ఇచ్చేసారు.
దళపతి ఇన్స్పైరింగ్ జర్నీ.. ఇప్పట్నుంచే పొలిటికల్ ప్రమోషన్స్..
విజయ్ నటించిన గోట్ (Goat) సినిమా లాస్ట్ సినిమా అని కొన్ని రోజులు ప్రచారం జరిగినా, ఇప్పుడు లాస్ట్ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చింది. తాజాగా తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన KVN ప్రొడక్షన్స్ విజయ్ లాస్ట్ సినిమాను నిర్మిస్తుండగా, విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ని, విజయ్ గురించి ఓ స్పెషల్ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. దళపతి విజయ్ సినిమా ఎంట్రీ మొదలుకొని.. విజయ్ ఫ్యాన్స్ తన సినిమాని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, అలాగే విజయ్ వల్ల ఎంతమంది సహాయం పొందారో చెప్తూ, విజయ్ ఫ్యాన్స్ తన గురించి ఎలా ఫీల్ అవుతున్నారో.. అంటూ విజయ్ ఫ్యాన్స్ మాటల్లో చెప్తూ, కొన్ని విజువల్స్ తో కూడిన ఎమోషనల్ వీడియో ని రిలీజ్ చేసారు. 5 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో విజయ్ ఫ్యాన్స్ ని భావోద్వేగానికి గురి చేసింది.
లాస్ట్ సినిమా అనౌన్స్ మెంట్…
ఇక ఈ వీడియో ద్వారా విజయ్ 69వ (Thalapathy69) సినిమానే తన చివరి మూవీ అంటూ ప్రకటించిన మేకర్స్, ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ & డీటెయిల్స్ రేపు అనగా, సెప్టెంబర్ 14న సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇక విజయ్ తన చివరి సినిమాను హెచ్. వినోత్ అనే దర్శకుడితో చేయనున్నారు. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 200 కోట్లకి పైగా పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ రేపు ప్రకటించే అవకాశం ఉంది.