టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood) ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది… ఎంతో కష్టపడి పైకి వస్తే… మరి కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెరపైకి వచ్చారు. అయితే కొంతమంది తమ.. కష్టాన్ని నమ్ముకుని కూడా పైకి వచ్చిన మారుతున్నారు. అలాంటివారు చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది హీరోలు… సినిమాలు చేయడానికి బాగా ఆలోచిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలు చేయడంలో ఒక విఫలమవుతున్నారు. అలాంటి హీరోల లిస్టు ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో… శర్వానంద్ కు (Sharwanand) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువసేన, లక్ష్మి, గాయం లాంటి సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్నాడు శర్వానంద్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ కూడా శర్వానంద్ కు ఉంది. కానీ వరుస పెట్టి సినిమాలు మాత్రం చేయడం లేదు. 2024 సంవత్సరంలో.. మనమే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. సైలెంట్ గా కలెక్షన్ రాబట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత… నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు శర్వానంద్ (Sharwanand).దీంతో శర్వానందుకు ఆఫర్లు రావడం లేదా అని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది అవకాశాలు వచ్చినా కూడా… శర్వానంద్ సినిమాలు చేయడం లేదని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ లిస్టులో మరొక హీరో కార్తికేయ (Karthikeya). ఆర్ఎక్స్ 100 లాంటి బంపర్ హిట్ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు కార్తికేయ. హీరో గానే కాకుండా…విలన్ పాత్రల్లో కూడా కనిపించి అందరిని మెప్పిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ అలాగే వాలి మై సినిమాలో నెగిటివ్ రోల్ చేసి మెప్పించాడు. ఇక.. భజే వాయు వేగం సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ… తన తదుపరి సినిమాను మాత్రం ఇంకా ప్రకటించలేదు. విలన్ పాత్ర చేసే సినిమాకు కూడా సైన్ చేయడం లేదట. దీంతో కార్తికేయ (Karthikeya) ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు.
ఇక మెగా హీరో వైష్ణవ తేజ్ (Vaisshnav Tej).. కూడా వరుసబెట్టి సినిమాలో చేయడం లేదు. ఉప్పెన సినిమాతో బంపర్ హిట్ అందుకున్న వైష్ణవ తేజ్… కెరియర్ చాలా దీనంగా తయారైంది. ఉప్పెన తర్వాత తీసిన… రంగ రంగ వైభవంగా అలాగే ఆదికేశవ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆదికేశవ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదు వైష్ణవి తేజ్. దీంతో వైష్ణవి తేజ్ (Vaisshnav Tej) ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలోనే కనిపిస్తున్నారు.