The Goat : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై దళపతి విజయ్ అభిమానుల్లో, అలాగే ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గోట్ సినిమా మొత్తం పరమ రొటీన్ స్క్రీన్ ప్లే తో అభిమానులకు సైతం విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు (Venkat prabhu) తెరకెక్కించాడని, వెంకట్ ప్రభు నుండి మరీ ఇంత చెత్త సినిమా వస్తుందని అనుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు.
వెంకట్ ప్రభు పై ఫైర్ అవుతున్న ఆడియన్స్…
అయితే దళపతి విజయ్ నటించిన సినిమా కాబట్టి తమిళ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. కానీ ఇతర భాషల్లో డిజాస్టర్ అయింది ఈ సినిమా. కనీసం డిస్ట్రిబ్యూటర్లకు సగం డబ్బులు కూడా రాకపోగా, తెలుగు, హిందీ ఆడియన్స్ అయితే దారుణంగా రిజెక్ట్ చేసారు. అయితే డైరక్టర్ వెంకట్ ప్రభు గోట్ సినిమాకు ఇతర భాషల్లో ఆదరణ లేకపోవడంపై అత్యంత చెత్త రీజన్ చెప్పాడు. ఆ కారణం వింటే మూవీ లవర్స్ ఎవరికైనా కోపం వస్తుంది. అన్నిటికి మించి క్రికెట్ ఫ్యాన్స్ వెంకట్ ప్రభుపై దారుణంగా ఫైర్ అయ్యారు. ఇంతకీ వెంకట్ ప్రభు చెప్పిన కారణం ఏంటంటే… గోట్ సినిమా క్లైమాక్స్ లో ఓ స్టేడియం లో CSK క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే, ఓ ఫైట్ ఉంటింది. CSK ఫ్యాన్స్ కోసం కొన్ని ఎలివేషన్లు ఉంటాయి. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నై టీమ్ కి, ధోని(MS Dhoni) కి ఎలివేషన్లు ఇచ్చినందుకు ఇతర రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కి అంటే, తెలుగు, హిందీ వాళ్లకు నచ్చలేదు అందుకే ప్లాప్ చేసారు అని కామెంట్ చేసాడు. ఇది తెలిసిన తెలుగు మూవీ లవర్స్ వెంకట్ ప్రభు పై దారుణంగా ఫైర్ అవుతున్నారు.
సినిమా తీయడం చేతకాక, ఇలాంటి చీప్ కారణాలు చెప్తారా?
అయితే డైరెక్టర్ వెంకట్ ప్రభుపై మూవీ లవర్స్ దారుణంగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఏ భాష సినిమా అయినా, కంటెంట్ బాగుంటే ఆ సినిమాకి బ్రహ్మరధం పట్టే తెలుగు ఆడియన్స్ వెంకట్ ప్రభుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు సినిమా సరిగా తీయడం చేతకాక, స్టార్లను అడ్డంగా గెస్ట్ అప్పీరెన్స్ కి వాడుకుని, గట్టెక్కుదామని అనుకున్న వెంకట్ ప్రభు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెట్టింట ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా విజయ్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, ఈ వీకెండ్ తర్వాత అసలు సినిమా ఎవ్వరూ పట్టించుకోరనే చెప్పాలి. మరి వెంకట్ ప్రభు చేసిన ఈ వ్యాఖ్యలపై మళ్ళీ ఏమైనా ఆడియన్స్ కి రిప్లై ఇస్తాడేమో చూడాలి.