Tollywood : టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా ప్రముఖులు అనారోగ్యంతో కన్నుమూస్తున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ రచయిత నడిమింటి నరసింగరావు ( Nadiminti Narasingarao ) కన్నుమూశారు.. డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishna Vamshi ) దర్శకత్వం వహించిన ‘గులాబీ’, రామ్ గోపాల్ వర్మ ( Rgv ) దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలకు మాటల రచయిగా పనిచేసిన ఈయన తుది శ్వాస విడిచారు. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
నడిమింటి నరసింగరావు గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష అదరణని పొందాయి. ఇప్పటికి యూట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాశారు నరసింగరావు.. అలాంటి ఆయన మరణించడం పై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగబ్రాంతికి గురవుతున్నారు. ఈయన వయసు బడటంతో అనేక అనారోగ్య సమస్యలతో పోరాడేవారు..
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోదా ఆస్పత్రి లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈయన పాతబస్తీ, ఊరికి మొనగాడు,కుచ్చికుచ్చి కూనమ్మా వంటి సినిమాలకి కూడా మాటల రచయితగా పని చేసారు. ఇక సినిమాలకు రచయిత బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపుని పొందిన ఆయన ఒకప్పుడు దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్‌కి కూడా రచయితగా చేసారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ కూడా రచయితగా పనిచేసారు. ఆయన రాసిన సీరియల్స్ మంచి క్రేజ్ ను అందుకున్నాయి.