Tapsee Pannu.. టాలీవుడ్ , బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను బాగా సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే ఎక్కువగా వివాదాలలోనే తల దూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తను ఏ విషయాన్ని అయినా చెప్పాలనుకుంటే ఆ విషయాన్ని ముక్కుసూటిగానే చెప్పేస్తూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో కంగనా రనౌత్ తర్వాత ఎక్కువ వివాదాలలో చిక్కుకుని హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించి పరవాలేదు అనిపించుకున్నది. అయితే తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా హవా చూపిస్తోంది.
తాప్సీ కొత్త సినిమా..
తాప్సీ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మతియాస్ బో అనే వ్యక్తిని సైతం తాప్సి వివాహం చేసుకున్నది. అయితే వివాహం అనంతరం ఈ ముద్దుగుమ్మ తన భర్త గురించి తన గురించి కానీ ఎక్కడ ఎలాంటి విషయాలను కూడా బయట చెప్పలేదు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కడ షేర్ చేయలేదు. కానీ తాజాగా తాప్సీ నటించిన ఫీర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ఆగస్టు 9న నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భర్త గురించి తన రిలేషన్షిప్ గురించి కొన్ని ప్రశ్నలు అడగగా పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది.
తన భర్త తో పరిచయం, ప్రేమ..
తాప్సీ ఈ ఏడాది మార్చి 23న వివాహం చేసుకున్నది. అయితే తన ఎంగేజ్మెంట్ అయి తొమ్మిది సంవత్సరాలు అయ్యిందని తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తన భర్త మతియాస్ బో తాను 11 ఏళ్ల క్రితమే కలిసామని, ఒక ఏడాది పాటు డేటింగ్ చేసిన తరువాతే తను ప్రపోజ్ చేసినట్లుగా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సమయంలోనే మేము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము. ఇన్ని సంవత్సరాల పాటు మేము విడిపోకుండా ఉన్నామంటే అది మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ వల్లనే అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
ఫస్ట్ డేట్ కి అలా చేశాం..
ఇక అంతే కాకుండా తమ ఫస్ట్ డేట్ కి ఇద్దరు కలిసి దుబాయ్ కి వెళ్ళామంటూ వెల్లడించింది.. తాప్సీ భర్త విషయానికి వస్తే.. ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు. 2012వ సంవత్సరంలో ఒలంపిక్స్ లో కూడా రజతం పతాకాన్ని సాధించారు. 2015 లో కూడా యూరప్ గేమ్ లో బంగారు బతకాన్ని కూడా విజేతగా అందుకోవడం జరిగిందట. వీటితోపాటు 2012, 2017 లో మతియాస్ బో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్ గా కూడా నిలిచినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తాప్సీ ఇన్నేళ్ల తర్వాత ఎంగేజ్మెంట్ విషయాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.