Tamil Vetri Kalagam Party: రాజకీయాలకి సినిమాలకి మధ్య మంచి సంబంధం ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది సినిమా ప్రేమికులు రాజకీయ నాయకులుగా తమ ముద్రణ వేశారు. కేవలం తెలుగులో కాకుండా తమిళ రాజకీయాల్లో చాలామంది తమిళనాడులో కొత్త పార్టీలను స్థాపించి రాజకీయాలను శాసించారు అని చెప్పొచ్చు. తెలుగు కంటే కూడా తమిళ రాజకీయ పార్టీలు దేశం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇకపోతే స్టార్ ఇమేజ్ ఉన్న తలపతి విజయ్ కూడా తమిళ్ వెట్రి కళగం పార్టీను స్థాపించిన సంగతి తెలిసిందే.
పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం తమ పార్టీ జెండాను ఎగురవేస్తామని సినీనటుడు, తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు 9.15 గంటలకు జెండా ఎగురవేసి పార్టీ గీతం విడుదల చేసారు. ‘‘రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మన జెండా ఎగురుతుంది. ఇక నుంచి తమిళనాడు బాగుంటుంది. గెలుపు ఖాయం’’ అని విజయ్ తెలియజేసారు.తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడటంలో మరియు రాష్ట్రానికి ప్రతీకగా నిలవడంలో తమ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని తెలియజేసారు.
ఇకపోతే విజయ్ మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు విజయ్ నటించిన గోట్ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీనితోపాటు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ సినిమాను విజయ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చాలామంది రాజకీయాల్లో కూడా తమ ప్రతిభను చూపించారు ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త్వరలో తెలియనుంది. ఒక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన పది సంవత్సరాలు తర్వాత నేడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. తమిళ్లో అంతటి ఇమేజ్ ఉన్న విజయ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడు వేచి చూడాలి.