Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు, ఐటం సాంగ్స్ తోనే అదరగొడుతోంది. సౌత్ ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో నార్త్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమన్నా నాకు తల్లి కావాలంటే భయంగా ఉంది అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఒక్క రీజన్ తో తల్లి కావాలంటే భయంగా..
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘స్త్రీ 2’లోని ‘ఆజ్ కీ రాత్’ పాటతో సంచలనం సృష్టించిన బ్యూటీ తమన్నా భాటియా. తన అందంతోనే కాదు పిచ్చెక్కించే డ్యాన్స్ మూమెంట్స్ తో తమన్నా ఐటం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కాగా తమన్నా పిల్లల విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమన్నాకు పిల్లలంటే భయమట. ఒక ఇంటర్వ్యూలో తమన్నా తాను తల్లి కావాలంటే ఎందుకు భయపడుతున్నాను అనే విషయాన్ని చెప్పింది. తాజాగా ఓ పోడ్కాస్ట్లో తమన్నా మాట్లాడుతూ ‘నేను తల్లి కావడానికి భయపడుతున్నాను. తల్లులు తమ పిల్లలకు అన్నీ ఇస్తారు. నా పిల్లలకు ఇంత ప్రేమ, సంరక్షణ, పెంపకం ఇవ్వలేను. నా తల్లిదండ్రులు నాకు చాలా ప్రేమను ఇచ్చారు. వాళ్ళను చూస్తుంటే పేరెంటింగ్‌లో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇదంతా నేను చేయగలనని అనుకోవడం లేదు. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందోనని భయపడుతున్నాను” అంటూ బాంబ్ పేల్చింది. తమన్నా నుంచి ఊహించని ఈ విషయాన్ని విన్నాక అంటే పెళ్లి తర్వాత కూడా తమన్నా తల్లి కదా అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతాయి.
తమన్నా చెప్పిన జీవిత పాఠాలు
ఈ ఇంటర్వ్యూలో తమన్నా భాటియా అనేక ఇతర విషయాల గురించి మాట్లాడింది. నేటికీ వీడియో గేమ్‌లు ఆడటానికి ఇష్టపడే తమన్నా పాఠశాలలో మంచి విద్యార్థినిని అని, చదువులకే ఎక్కువ సమయం కేటాయించేదాన్ని అని చెప్పింది. చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో పట్టించుకోనని తమన్నా అంటోంది. మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని నమ్మే తమన్నా.. ఆడవాళ్లు అన్నీ చేయగలరని చెబుతోంది. “ఇతరులు ఏమనుకుంటున్నారో మర్చిపోండి. మొదట మీకు ఏమి కావాలో మీరే నిర్ణయించుకోండి” అంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పింది. ఇక బంధం బలపడాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానంగా తమన్నా ఏం చెప్పిందంటే.. “మీ పార్టనర్ చెప్పేది ప్రశాంతంగా వినండి. ఇది ఏ సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఇది వారికి ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది. మీతో నేను ఉన్నాను. మీ పోరాటానికి నేను మద్దతు ఇస్తాను. మీరు ఏమి చేసినా నేను మీకు అండగా ఉంటానని వారికి భరోసా ఇస్తే చాలు” అంటూ తన ఫ్యాన్స్ కు ప్రేమ పాఠాలు కూడా చెప్పింది. ఇదిలా ఉండగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. తమన్నా భాటియా, విజయ్ వర్మ త్వరలో వివాహం చేసుకోవచ్చని రూమర్స్ నడుస్తున్నాయి .